ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై కొన్ని విషయాలు PART2

   


  SPREAD NEWS;- 11.  1983 జనవరి 20 వ తారీఖు - ఓడిపోయిన పదిహేను రోజులకే కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం లో చేరుతాను అని ప్రకటించిన చంద్రబాబు.  

12.  1983 జనవరి 22 వ తారీకు .. గత ఎన్నికలలో చిత్తూర్ జిల్లా లో తెలుగుదేశం ఓటమికి తీవ్ర కృషి చేసి, తెలుగుదేశం కార్యాలయాన్ని తన అనుచరులతో ధ్వంసం చేయించిన చంద్రబాబు ను పార్టీ లో చేర్చుకుంటే అది పార్టీ పతనానికి నాంది పలుకుతుందని ఎన్టీఆర్ ను హెచ్చరించిన తెలుగుదేశం నేత సిద్ధయ్య మూర్తి... (ఈయన అనుభవం తో చేసిన హెచ్చరిక పుష్కరం తిరగకుండానే వాస్తవం అయింది )

13.  1983 జనవరి 23 వ తారీకు -  తెలుగుదేశం పార్టీ రాష్ట్రస్థాయి సదస్సులో చంద్రబాబు ను ఓడించిన మీసాల నాయుడు లేచి కాంగ్రెస్ పార్టీ వారిని తెలుగుదేశం పార్టీ లో చేర్చుకోరాదని తీర్మానం పెట్టారు.  దీనికి 99 శాతం మంది మద్దతు పలుకుతూ చేతులు పైకెత్తారు.  చంద్రబాబు ను పార్టీ లోకి ఆహ్వానిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని పార్టీ మహిళా విభాగం నాయకురాలు శ్రీమతి రమణమ్మ అసంతృప్తి వ్యక్తపరిచారు.  చంద్రబాబు చేరికను వ్యతిరేకిస్తూ మరో మహిళా నాయకురాలు శ్రీమతి సీతా మహాలక్ష్మి దేవి కన్నీరు పెట్టుకున్నారు.  వీరందరికి నచ్చ చెప్పి చంద్రబాబు ను పార్టీలో చేర్చుకున్నారు ఎన్టీఆర్.  

 ( కాంగ్రెస్ పార్టీ ఓటమితో దిగ్భ్రమ చెందిన చంద్రబాబు ఇక తన రాజకీయ భవిష్యత్తును తలుచుకుని కుమిలిపోయి తన భార్య ద్వారా మామగారికి రాయబారం పంపించారు.  తన భర్త జీవితం గురించి శ్రీమతి భువనేశ్వరి తండ్రి దగ్గర కన్నీరు పెట్టుకోవడం తో ఎన్టీఆర్ పుత్రికా ప్రేమతో తన గొయ్యి తానె తవ్వుకున్నారు.  పార్టీ వారు అందరూ చంద్రబాబు రాకను వ్యతిరేకించడం తో దిక్కు తోచని ఎన్టీఆర్ ' ఒక కమిటీ ని వేస్తాను అని,  చంద్రబాబు ను చేర్చుకోవాలా వద్దా అనేది ఆ కమిటీ నిర్ణయిస్తుంది' అని ప్రకటించి ముగ్గురో నలుగురో  సభ్యులతో ఒక కమిటీ ని వేశారు.  ఎన్టీఆర్ మనోగతం ఎరిగిన కమిటీ వారు చంద్రబాబు ను చేర్చుకోవచ్చు అని సిఫార్స్ చేశారు.  పదవిని కోల్పోయి ఒక్క నెల కూడా చంద్రబాబు గడపలేక పోయారు. )