8న ఘనంగా రైతు దినోత్సవం

      రైతుల అభ్యున్నతే ధ్యేయంగా పలు పనులకు శ్రీకారం

రూ. 413.76 కోట్లతో నిర్మించిన 1,898 రైతు భరోసా కేంద్రాలు

రూ. 79.50 కోట్లతో ఏర్పాటైన 100 వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు, ఆక్వాల్యాబ్‌లు, సీఏడీడీఎల్‌లు

     


spread news(అమరావతి);-సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ రెండు రోజుల పాటు వైఎస్సార్‌ కడప, అనంతపురం జిల్లాలలో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని పండుగలా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. దీంతోపాటు పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపనల అనంతరం ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. రెండో రోజు బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, బహిరంగసభలో పాల్గొంటారు, ఆ తర్వాత కడప నగరంలో వివిధ అభివృద్ది పనుల శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొని అనంతరం గన్నవరం చేరుకుంటారు.

ఆర్‌బీకేలకు అనుసంధానంగా రూ. 96.64 కోట్లతో 611 వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలు (సీహెచ్‌సీలు)తో పాటు పాడిరైతుల కోసం ప్రత్యేకంగా 34 సీహెచ్‌సీల ప్రారంభోత్సవం

రూ. 31.74 కోట్లతో నిర్మించిన 53 కొత్త వెటర్నరీ ఆసుపత్రుల ప్రారంభం

రూ. 400.30 కోట్ల వ్యయంతో 1,262 గోదాముల నిర్మాణానికి శంకుస్ధాపనలు

రూ. 200 కోట్లతో పోస్ట్‌ హార్వెస్టింగ్‌ వసతుల కల్పన

రూ. 212 కోట్లతో మార్కెట్‌యార్డ్‌లలోనూ నాడు – నేడు పనులు

రూ. 7.53 కోట్లతో విజయవాడలో పాడిరైతుల కోసం ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌

రూ. 45 కోట్లతో 45 కొత్త రైతు బజార్లకు శంకుస్ధాపనలు, 6 రైతు బజార్ల ప్రారంభోత్సవం

రాష్ట్ర స్ధాయిలో, జిల్లా స్ధాయిలో, మండల స్ధాయిలో నగదు ప్రోత్సాహకాలతో రైతులకు సత్కారం