టిడిపి నేత చంద్రబాబు నాయుడు,రఘురామ,ఏబిఎన్,టివి-5 చానళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటమ్

 పి.వి.సునీల్ కుమార్ కి మద్దతుగా శ్రీకాకుళంలో భారీ ర్యాలీ.

  అంబేద్కర్స్ ఇండియా మిషన్ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ ,రాష్ట్ర డిజిటల్ మీడియా సభ్యుడు తైక్వాండో శ్రీను

     


SPREAD NEWS (శ్రీకాకుళం);-  సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను చైతన్యవంతులను చేయడంతో పాటు వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీనియర్ ఐపిఎస్ అధికారి పి.వి.సునీల్ కుమార్ జోలికి వస్తే ఖబడ్థార్ అంటూ అంబేద్కర్స్ ఇండియా మిషన్ నాయకులు ,సైనికులు శనివారం శ్రీకాకుళంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.అంబేద్కర్ ఆశయాల కోసం కృషి  చేస్తున్న ఐపిఎస్ అధికారిపై కుట్రలు పన్నడంపై మండిపడ్డారు.పి.వి.సునీల్ కుమార్ పై బుదరజల్లే కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా అంబేద్కర్స్ ఇండియా మిషన్ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ ,రాష్ట్ర డిజిటల్ మీడియా సభ్యుడు తైక్వాండో శ్రీను ఆద్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ఏఐమ్ నాయకులు,సైనికులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

     . పి.వి.సునీల్ కుమార్ పై బురదజల్లేలా కుట్రలు పన్నుతున్న చంద్రబాబు,రఘురామలతో పాటు పచ్చమీడియా ఏబిఎన్,టివి-5 చానళ్ళ దిష్టిబొమ్మలులను ర్యాలీలో ప్రదర్శించారు. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల జంక్షన్ వద్ద నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ కృష్ణాపార్క్,పెద్దరెల్లివీది,డే అండ్ నైట్ జంక్షన్ మీదుగా అంబేద్కర్ జంక్షన్ వరకూ కొనసాగింది. అక్కడ ఏఐమ్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. విగ్రహం ఎదుట దిష్టిబొమ్మలు ఉంచి నిరసనలను తెలిపారు. పి.వి.సునీల్ కుమార్ కి మద్దతుగా చంద్రబాబు,రఘురామ,ఏబిఎన్,టివి-5 చానళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.

     రఘురామ,ఏబిఎన్,టివి-5 చానళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఈ సందర్భంగా దిష్టిబొమ్మలను దగ్థం చేసేందుకు ఏఐమ్ సైనికులు ప్రయత్నించగా భారీ ఎత్తున మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఏఐమ్ నాయకులు,సైనికుల చేతుల్లో నుంచి దిష్టిబొమ్మలను తీసుకుని వాహనాలలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్స్ ఇండియా మిషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళాడ రవీంద్ర,సైనిక్ జిల్లా అధ్యక్షులు కళ్ళేపల్లి హరికృష్ణ,ప్రధాన కార్యదర్శి పెయ్యిల చంటి, ఉగాది, శ్రీకాకుళం డివిజన్ అధ్యక్షుడు దువ్వాన అప్పలసూరి ,టెక్కలి డివిజన్ అధ్యక్షులు చింతాడ దిలీప్ కుమార్,పాలకొండ డివిజన్ అధ్యక్షులు చుక్కా రాంబాబు,సహాయ కార్యదర్శి గుజ్జల సూర్యనారాయణ,శ్రీకాకుళం నియోజకవర్గ కన్వీనర్ కొత్తూరు సత్యన్నారాయణ ,డివిజన్ సెక్రటరీ బూర ఆనందరావు ,టెక్కలి నియోజకవర్గ ఇన్ చార్జి పేర మురళీ, శ్రీకాకుళం టౌన్ ఇన్ చార్జి యాగాటి ప్రసాద్ ,సోషల్ మీడియా ఇన్ చార్జి జోగిపాటి వంశి,బసవల లక్ష్మీనారాయణ,దుంపడు,రాములతో పాటు ఏఐమ్ సైనికులు మీనాక్షి,గిరిజా శంకర్,సాకేటి నాయుడు ,మజ్జి గౌతమ్ ,దాసరి కిరణ్ ,జోగిపాటి భాస్కర్, మణి ,పంకు మహేష్,పంకు మురళీ, పాత్రునివలస రాజు ,రణస్థలం చంటి తదితరులు పాల్గొన్నారు.