సర్వేపల్లి నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి

   


 SPREAD NEWS(నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం);- మండలం లోని 11 కోట్ల పది లక్షల రూపాయల వ్యయంతో సర్వేపల్లి రిజర్వాయర్ పునర్ నిర్మాణ పనులను 17వ తేదీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా వందకోట్ల నిధులు మంజూరు చేయించి సర్వేపల్లి అగ్రభాగాన నిలబడేందుకు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కృషి. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుబిడ్డగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన మన సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీర్వచనంతో 11 కోట్ల 10 లక్షలు పెట్టి సర్వేపల్లి రిజర్వాయర్ శంకుస్థాపన చేశారు.

     ఈ రిజర్వాయర్ 20 సంవత్సరాల పాటలు మరమ్మతులకు ఆస్కారం లేకుండా పటిష్టమైన విధానంతో అదేవిధంగా కింద సాగు నీటి కాలువల కట్టడాల కోసం 19 కోట్లు, బండేపల్లి కోసం 32 కోట్లు, ఎడమ కాలువ లైనింగ్ 39 కోట్లు, మొత్తం కలిపి 150 కోట్లు, అధికార శాసనసభ్యునిగా రెండుసార్లు రెండు సంవత్సరాల పదవీ కాలంలో నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించానని, తెలుగుదేశం ప్రభుత్వంలో నీరు, చెట్టు, అంటూ ఎన్నో అవినీతి  చేశారని. కానీ నేను మాత్రం రైతులకు ఏది అవసరమో ఆ అవసరాలు తీర్చే దానికి ప్రయత్నిస్తున్నాన‌ని అన్నారు.


 కాకాణి చేతుల మీదుగా రోడ్ల ప్రారంభోత్సవం

     సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పరుగులు పెడుతుంది.జట్లకొండూరు గ్రామపంచాయతీలో అధికార పార్టీ శాసనసభ్యునిగా రెండు సంవత్సరాల కాల వ్యవధిలో 5కోట్ల రూపాయలతో గ్రామాలకు రోడ్లు, గ్రామాలలో అంతర్గత సిమెంటు రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సదుపాయం కల్పించాం. తెలుగుదేశం హయాంలో అభివృద్ధి పేరిట కేవలం ఉత్తర్వుల కాగితాలు చేతికిస్తే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కాగితాలకు పరిమితం కాకుండా, వాస్తవ రూపం దాల్చేందుకు చర్యలు తీసుకున్నాం.

    తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో అన్యాయం చేస్తే, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అవసరమైన నిధులు మంజూరు చేయించి, నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తా.