జూమ్ బాబా చంద్రబాబువాట్సప్ బాబా సోమిరెడ్డి విన్యాసాలు మానుకోవాలి-కాకాణి

     


 తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల విశ్వాసం ప్రకటించి, డాక్టర్ గురుమూర్తి గారిని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు, విజయం కోసం కృషిచేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సానుభూతిపరులకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే కాకాణి.తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలోకి సర్వేపల్లి నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెట్టి, 40,895 ఓట్ల భారీ మెజారిటీ అందించిన నియోజకవర్గ ప్రజలకు, నిర్విరామంగా తపనపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన ఎమ్మెల్యే కాకాణి.

      తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో గతంలో సాధించిన మెజారిటీ కన్న అధిక మెజారిటీ అందించడంతో మా బాధ్యత మరింత పెరిగింది.జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పక్షపాత వైఖరి లేకుండా, పారదర్శకంగా అందించడం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కరోనా లాంటి అసాధారణ పరిస్థితులలో, ప్రతికూల వాతావరణంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైనా, ప్రజలు అధిక మెజారిటీ అందించడం విశేషం.

     ప్రపంచంలోనే అత్యంత అబద్దాలకోరుగా పేరుగాంచిన చంద్రబాబునాయుడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో "అబ్బ కన్నా కొడుకు ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్పగలడని" తండ్రి చంద్రబాబు రికార్డును కొడుకు లోకేష్ బద్దలు కొట్టాడు. చంద్రబాబు గ్రామ స్థాయి నాయకుడి కన్న దిగజారి, వార్డు సభ్యుడి స్థాయి కూడా లేని సోమిరెడ్డి లాంటి వారితో కలిసి మాపై తిట్ల వర్షం కురిపించాడు. సోమిరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని పాల్పడిన అవినీతికి, అధికార పార్టీ శాసన సభ్యునిగా నా హయంలో జరిగిన అభివృద్ధికి తిరుపతి పార్లమెంటు ఎన్నికలను "రెఫరెండం" గా భావించాలి.

     ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికీ, "ఎవరు అభివృద్ధి కారకుడో, ఎవరు అవినీతిపరుడో" తేటతెల్లమైంది.సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డిని 4సార్లు ఛీకొట్టి తరిమికొట్టినా, తగుదునమ్మానంటూ తిరుపతి పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి రావడంతో, ఈ సారి బట్టలు ఊడదీసి తరిమారు. "జూమ్ బాబా చంద్రబాబు", "వాట్సప్ బాబా సోమిరెడ్డి" ఇప్పటికైనా తమ విన్యాసాలు మానుకొని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన నేరాలకు, ఘోరాలకు చెంపలు వేసుకొని పశ్చాత్తాప పడుతూ శేష జీవితం గడపడం మంచిది. 7నియోజకవర్గాలలో అత్యధిక మెజారిటీ అందించిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల పట్ల సేవకుడిగా బాధ్యత మరింత పెరిగిందని తెలియజేస్తూ, ప్రజల రుణం తీర్చుకోవడానికి సాయశక్తులా, అనునిత్యం అందుబాటులో ఉండి, సేవలందిస్తా.