కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష

 


ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు,ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలి.

అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలి,టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలి

     కోవిడ్‌ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు.కోవిడ్‌ ఆస్పత్రుల్లో క్వాలిటీ ఫుడ్, శానిటేషన్, ఆక్సీజన్, మెడికల్‌ కేర్, వైద్యుల అందుబాటు.. ఈ అయిదూ తప్పనిసరి,ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశం.తగినంత ఆక్సీజన్‌ సరఫరా, నిల్వ కోసం చర్యలు చేపట్టండి.మనం రికార్డు స్థాయిలో పరీక్షలు చేస్తున్నాము. మన రికార్డులను మనమే బద్ధలు కొడుతున్నాము.కోవిడ్‌ చికిత్స కోసం తీసుకున్న అన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చికిత్స చేయాలి. ఇందులో ఎక్కడా తేడా రాకూడదు.104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ వస్తే, ఆ రోగి ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఆ జిల్లాకు మెసేజ్‌ వెళ్తుంది.వెంటనే కలెక్టర్, జిల్లా యంత్రాంగం స్పందించి, ఆయా ఆస్పత్రులలో రోగులను చేర్పించాలి. ఇది ప్రక్రియ.