13 ఆస్పత్రుల్లో 9 ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడట్లు నిర్ధారణ

     


SPREAD NEWS(విజయవాడ);-మొత్తం 13 ఆస్పత్రుల్లో తనిఖీలు, 9 ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడట్లు నిర్ధారణఇప్పటివరకు అవకతవకలకు పాల్పడ్డ మొత్తం 46 ఆస్పత్రులపై యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు.రెమిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న మూడు జిల్లాల్లో ఐదుగురు వ్యక్తులపై వేరువేరుగా కేసులు నమోదు.ఒకే ఆస్పత్రిపై రెండు సార్లు కేసులు నమోదు అయితే  ఆస్పత్రి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడంతో పాటు  ఆస్పత్రి రిజిస్ట్రేషన్  రద్దు చేస్తాం.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆరోగ్యశ్రీ క్రింద అర్హులైన రోగులకు కరోనా చికిత్స ఉచితంగా అందించకపోతే ఆస్పత్రుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవు.

      గత రెండు రోజుల్లో మొత్తం 13 ఆస్పత్రులను తనిఖీ చేసి 9 ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడట్లు నిర్ధారించి సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ కేవీ. రాజేంద్రనాథ్ రెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు.కేసులు నమోదు చేయబడిన ఈ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ధేశించిన రేట్ల కంటే అధిక మొత్తం వసూలు చేయడం, అర్హత ఉన్న రోగులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్సను నిరాకరించడం, ఆరోగ్యశ్రీ క్రింద రోగుల నుండి డబ్బులు వసూలు చేయడం, కేటాయించిన రెమిడిసివిర్ ఇంజక్షన్లను దుర్వినియోగం మరియు అధిక ధరలకు అమ్మడం చేస్తున్నట్లు తమ తనిఖీల్లో గుర్తించామన్నారు.