రేణిగుంట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ని కలిసిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


     స్ప్రెడ్ న్యూస్ (renigunta);- కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తిరుమల వచ్చి  ఆ దేవదేవుని దర్శించుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే.  రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఘనస్వాగతం లభించింది. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి, ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనం అనంతరం ఢిల్లీకి బయలుదేరడానికి  రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకొని హైదరాబాద్ ప్రయాణం పయనమైన మేకపాటి కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి షెకావత్ ను ఎయిర్ పోర్టులోని వీఐపీ లాంజ్ లో కలిశారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు.  కేంద్ర మంత్రికి వీడ్కోలు పలకడానికి అప్పటికే అక్కడ ఉన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.