శభాష్ ఏఏజి కంటతడి పెట్టించిన వాదనలు


     స్ప్రెడ్ న్యూస్ - అమరావతి ;-  ఏపీ ప్రభుత్వం తరఫున బలమైన వాదనను  వినిపిస్తూ ప్రభుత్వానికి అండగా ఉన్నా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్వోలు సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి గారు మీ కర్తవ్యం అమోఘం, మీలాంటి వాళ్లు బతికి సాధించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎప్పుడు కూడా పొరపాటున కూడా అధర్య పడవద్దు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే డిడి కాలేజీలో స్పాట్ అడ్మిషన్ లవ్ వ్యవహారంపై బలమైన వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి.


    ఇటీవలే ఆయన కరోనా బారిన పడి హైదరాబాద్ హాస్పటల్లో చికిత్స పొందుతూ, బెడ్ మీద నుంచే తన వాదనలు వినిపించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే న్యాయ వ్యవస్థలో మంచి పేరు మొదటి నుండి కూడా వైసిపి కేసులను వాదిస్తున్న న్యాయవాది సుధాకర్ రెడ్డి ముందుంటారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన్ను అడ్వకేట్ జనరల్ గా నియమించారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రాగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నారు. మృత్యువుతో పోరాడుతున్ప్పటికీ వీడియో ద్వారా హాజరై అందరినీ అందరి మనసులను కదిలించారు.


    ఈయన వాదనల వాదనలు వినిపిస్తున్నప్పుడు చేతికి సెలైన్ ఆక్సి మీటర్ తో కనిపించారు. కోవిడ్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నానని, ప్రస్తుతం మరణశయ్యపై ఉన్నానన్నారు. ఈ కేసులో ఇవే నా చివరివాదనలు  మరోసారి వాదనలు వినిపించేందుకు  నేను బతికి ఉంటానో లేదో తెలియదని, కావున నేను చెప్పిన విషయాలను ఆలకించాలని ఆయన భావోద్వేగంతో వేడుకున్నారు. హైకోర్టు  ధర్మాసనం లో జడ్జిలు రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవితో,  కూడా ధర్మాసనం స్పందిస్తూ ప్రస్తుతం వైరస్ కు  భయపడాల్సిన పని లేదని ధైర్యం చెబుతూ మీరు త్వరగా కోలుకుని తిరిగి వచ్చి తప్పనిసరిగా వాదనలు వినిపిస్తారని ధైర్యం చెప్పారు. సుధాకర్ రెడ్డి త్వరలోనే కోలుకొని సమాజానికి ఉపయోగపడేలా తన విధులు నిర్వర్తించాలని ఆ దేవుణ్ణి ఆశీర్వదించాలని కోరుకుందాం.