spread news;- ఎస్వీబీసీ ఛానల్ లో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రసారం చేశారు అని ప్రశినింసిన టీడీపీ.వాస్తవం ఏంటంటే... టీటీడీ అనుబంధంలో ఏడు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి.వాటికి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలవుతాయి. ఉదాహరణకు: మధ్యాహ్న భోజనం పథకం కింద ఈ ఏడు టీటీడీ ఎయిడెడ్ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో ఉచితంగా నిర్వహిస్తూవుంది.
అలాగే, ఈ ఏడు పాఠశాలల్లో విద్యార్థులకు "జగనన్న విద్య దీవెన పథకం" కింద 2134 కిట్లను రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది.ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున టీటీడీ ఎయిడెడ్ పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి టీటీడీ యాజమాన్యం తరపున డి.ఈ.ఓ మరియు జేఈఓ గారు హాజరు అయ్యారు.టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో జరిగే కార్యక్రమం కావున ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారమయ్యే న్యూస్ లో రెండు నిమిషాలు చూపించడం జరిగింది.
దీనిని టీడీపీ వాళ్లు తెలియకుండా పనిగట్టుకుని మరీ దుష్ప్రచారంలో భాగంగా వాడుకుంటున్నారు. ముఖ్య గమనిక: టీటీడీకి సంబంధించిన ప్రదేశాలలో జరిగే కార్యక్రమాలను చిత్రీకరించి, ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారమయ్యే న్యూస్ ఐటమ్ ద్వారా ఒకటి లేదా రెండు నిమిషాలు చూపించడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. ఇదేమీ కొత్త ఏమి కాదు.