నెల్లూరు జిల్లాలోని జర్నలిస్టులకు శిక్షణా తరగతులు శుభ పరిమాణం


     స్ప్రెడ్ న్యూస్ (నెల్లూరు );-  ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కు జూన్ యాప్ ద్వారా శిక్షణా తరగతులు నిర్వహించారు ఈ శిక్షణా తరగతులు  మొదట నెల్లూరులోనే ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కరోనా వైరస్ ఎక్కువ ఉన్న దృష్ట్యా వైజాక్ లోప్రారంభించామని ఈరోజు నెల్లూరులో ప్రారంభిస్తున్నామని ఈ శిక్షణా తరగతులను అందరు జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విక్రమ సింహపురి యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఎల్.వి.కె. రెడ్డి ప్రారంభ ఉపన్యాసం చేసి అతిధులకు స్వాగతం పలికారు.


     సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఓపికతో ఉండాలని,ఎక్కువగా జనాల్లో తిరిగి వార్తలు సేకరించాలని.ఆలోచన పరమైన జర్నలిజం వృత్తికి సహకరిస్తుందని, జర్నలిజం లోని మెలకువలు   చెప్పారు.సీనియర్ జర్నలిస్ట్లు  శశాంక్ మోహన్,కె.ఎస్. చంద్ర గారు,జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారు. క్షేత్ర స్థాయి సందర్శనే జర్నలిస్టులకు బలం అని అన్నారు.


    సంఘటనా స్థలానికి వెళ్లకుండా వార్తలు రాస్తే అనేక విషయాలు మరుగున పడిపోయే అవకాశం ఉందని, సంఘటనా స్థలాన్ని సందర్శిస్తే అనేక కొత్త కోణాలు వెలుగుచూసే అవకాశం ఉందని అనేక ఉదాహరణలు చెప్పారు.ప్రెస్ అకాడమీ 26 అంశాలలో ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది అని తెలిపారు. వాట్స్ యాప్ లో వచ్చే వార్తలను పూర్తిగా నమ్మవద్దని, వాటిని నిర్ధారించుకున్న తర్వాతే వార్తలను రాయాలని సీనియర్ జర్నలిస్ట్ శశాంక్ మోహన్ నెల్లూరుజిల్లా జర్నలిస్టులకు సూచించారు.