జాతిపిత మహాత్మాగాంధీ జివితములో అనుసరించ వలసిన ఆర్థిక సూత్రాలు


     స్ప్రెడ్ న్యూస్ ;- మన జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి నేడు. ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు, రాజకీయ నాయకులు,ప్రజలు,మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. మహాత్మాగాంధీజీవితం నుండి మనం నేర్చుకోదగ్గ సూక్తులు(1) ముఖ్యమైన ఖర్చులు తప్ప అనవసర ఖర్చులు  ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవాలి. సత్యశోధనలో తాను చేసిన ప్రతి ఖర్చులను ఎలా లెక్కించాడో పేర్కొన్నారు.(2)ప్రపంచం ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చుతుంది. కానీ అందరి దురాశ కాదు అని పేర్కొన్న మహాత్మా జీవితంలో మనం నిర్ణయాలను ఏ విధంగా తీసుకోవాలో చెబుతుంది. పెట్టబడులు గానీ, మన దైనందిన జీవితంలో సాధారణ వస్తువులను కొనడం విషయంలో గానీ మనకు అవసరమైనదాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి.


     (3)ప్రారంభంలోనే అద్భుతాలు జరిగిపోవాలని ఆశించవద్దు. ఏదైనా సరే ఇటుక ఇటుకగా నిర్మించుకోవాలన్నారు. ఈ రోజు చేసిన చిన్న పెట్టుబడి భవిష్యత్తులో పెద్దదిగా మారుతుందన్నారు.(4)మహాత్మాగాంధీ, క్రమశిక్షణ పర్యాయపదాలుగా మారాయి. జీవితాంతం సత్యం, క్రమశిక్షణకు కట్టుబడి మహోన్నత శిఖరాలను అధిరోహించాడు గాంధీ. మనం ఆర్థిక క్రమశిక్షణను నేర్చుకోవడంతో పాటు దాన్ని పాటించాలి.


     (5)స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ విపరీతమైన కష్టాలను ఎదుర్కొన్నాడు. కాని ఆయనెప్పుడు సహనాన్ని, విశ్వాసాన్ని వదల్లేదు. అతని బలమైన సంకల్ప శక్తి, సహనం, విశ్వాసం కష్ట సమయాల్లో అతన్ని ఆదుకోవటానికి సహాయపడ్డాయి. సహనం, విశ్వాసం విషయానికి వస్తే పెట్టుబడి కూడా ఇటువంటి దాన్నే పోలి ఉంటుంది. రాత్రికిరాత్రే మీ పెట్టుబడులు మిలియన్లుగా పెరెగేందుకు అంగీకరించవద్దు. దీనికి కొంత సమయం ఇచ్చి సహనంతో వేచి చూడాలి.


1)అధిక వ్యయాన్ని తగ్గించండం
2. అత్యాశకు పోకుండా అవసరానికి అనుగుణంగా పెట్టుబడి పెట్టడం
3. ప్రారంభంలోనే అద్భుతాలు జరగాలనుకోవద్దు
4. ఆర్థిక క్రమశిక్షణను పాటించడం
5. సహనం, విశ్వాసం


జాతిపిత మహాత్మాగాంధీ అనుసరింసిన ఈ సూత్రాలు మీరు గూడా అనుసరించి మీరు జివితములో గొప్పగా రాణించాలని కోరుకొంటున్నాను.