స్ప్రెడ్ న్యూస్ ( ఢిల్లీ );- ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు బేటీ జరిగింది. ఉదయం హస్తినలో మోదీతో భేటీ అయిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించిచారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సాయంపై జగన్ ద్రుష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ఈ సమావేశం జరిగింది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్రమంత్రి వర్గంలో వైయస్సార్సీపీ చేరుతోందంటూ ప్రచారం జరుగుతున్నవేళ ప్రధానితో సీఎం జగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరింసుకున్న, అవేమి కావు రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ఈ బేటీ జరిగింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, వైయస్సార్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ఈ బేటీలో పాల్గొన్నారు.