హ్యాట్సాఫ్ టు NSS , NYKS వాలంటీర్లు


     స్ప్రెడ్ న్యూస్ (నెల్లూరు );- రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో మంగళవారం నాడు విక్రమ సింహపురి యూనివర్సిటీ NSS , NYKS వాలంటీర్లు ఎం సాయిముని,అజిజ్ , రాహుల్ కోవిడ్ ని జయించి ప్లాస్మాతెరఫి చికిత్స కోసం ప్లాస్మాదానం చేశారు.విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ L విజయకృష్ణా రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ తో పోరాడుతున్నా వారికి NSS , NYKS వాలంటీర్లు ముందుకు వచ్చి ప్లాస్మాదానం చెయ్యడం అభినందనీయమని కొనియాడారు. 


    అన్ని దానాలలో ఇప్పటి పరిస్థితుల్లో ప్లాస్మాదానం మిన్న అని తెలిపారు.కోవిడ్ జయించినా వాళ్ళు కోవిడ్ తో పోరాడుతున్నా వారికి ప్లాస్మా తెరఫీ చికిత్స కోసం ప్లాస్మాదానం చెయ్యాలని పిలుపునిచ్చారు.ప్లాస్మాదానం చేసినా ప్లాస్మాదాతలను అభినందించారు.ఈరోజు ప్లాస్మాదానం చేసినా ప్రతి ఒక్క ప్లాస్మాదాతకు రెడ్ క్రాస్ కమిటీ తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు బయ్యా ప్రసాద్ అన్నారు.


    ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు బయ్యా ప్రసాద్ , బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ అజయ్ బాబు , NSS పోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ అల్లం ఉదయ్ శంకర్ , NYKS కో ఆర్డినేటర్ డాక్టర్ A మహేంద్ర రెడ్డి , NSS పోగ్రాం ఆఫీసర్ డాక్టర్ గోపి , YRCS కన్వీనర్ డాక్టర్ శ్రీరంజని పాల్గొన్నారు. ప్లాస్మాదానం చేసిన  ఎం సాయిముని , అజిజ్ , రాహుల్లను స్ప్రెడ్ న్యూస్ పాఠకుల తరుపున అబినందనలు. ఇటువంటి మంచి కార్యక్రమాలకు కేంద్ర బిందువు ఐన విక్రమ సింహపురి యూనివర్సిటీవారికీ కూడా ప్రత్యేక అభినందనలు.