మామ దివంగత ఈ.సి. గంగిరెడ్డి గారి సంస్మరణ కార్యక్రమంలో ఏపీ సీఎం


    spreade news(పులివెందుల);- పులివెందులకు చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు, ముఖ్యమంత్రి గారి మామ దివంగత ఈ.సి. గంగిరెడ్డి గారి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనడానికి 11.45గం.లకు వైఎస్ఆర్ ఆడిటోరియం చేరుకున్న ముఖ్యమంత్రి.డా. ఈ.సి. గంగిరెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు, పుష్పాంజలులు వేసి ముఖ్యమంత్రి నివాళులర్పించారు.నేటి ఉదయం 11.30గం.లకు పులివెందుల హెలిప్యాడ్ కు చేరుకున్న గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.నేరుగా  వైఎస్ఆర్ ఆడిటోరియం చేరుకున్న ముఖ్యమంత్రి.



    పులివెందుల వైఎస్ఆర్  ఆడిటోరియంలో జరుగుతున్న డాక్టర్ ఈసీ గంగిరెడ్డి గారి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి తోపాటు పాల్గొన్న వైఎస్ విజయమ్మ , వైఎస్ భారతి, ఎంపీలు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, పి. మిథున్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఎస్ బి అంజద్భాష, జిల్లా ఇంఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్,  మంత్రి విశ్వరూప్, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి,  కమలాపురం, మైదుకూరు, శ్రీకాళహస్తి, పాణ్యం ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్ రెడ్డి, ఎస్. రఘురామి రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి,కాటసాని రాం భూపాల్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్, జిల్లా ఇంఛార్జి కలెక్టర్ ఎం.గౌతమి, జాయింట్ కలెక్టర్లు సి.ఎం.సాయికాంత్ వర్మ, పి.ధర్మచంద్రారెడ్డి, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, పాడా ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, డ్వామా పీడి యధుభూషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



    డా.ఈ.సి.గంగిరెడ్డి గారు వైద్య వృత్తిలో చూపిన అంకితభావం, వైద్యం కొరకు వచ్చే పేద ప్రజల పట్ల ఆదరణ చూపి వారి నుంచి డబ్బులు ఆశించకుండా, ప్రేమతో వైద్య సేవలు అందించేవారని డా.గంగిరెడ్డి గారి సేవా నిరతిని గురించి పలువురు సంస్మరణ సభలో కొనియాడారు.అటువంటి మంచి మనిషి మన మధ్య లేఖ పోయిన మన మనసులో ఎపుడూ ఉంటారని,అనంతరం డా.ఈ.సి.గంగిరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధనలు చేశారు.