స్ప్రెడ్ న్యూస్ ;- కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 అవార్డుల్లో విజయవాడ, విశాఖపట్నంలు దేశంలోనే టాప్ టెన్ లో నిలిచాయి. అత్యంత స్వచ్ఛమైన నగరాల జాబితాలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 ( Swachh Survekshan 2020 ) లో విజయవాడ 4వ స్థానాన్ని, విశాఖపట్నం 9వ స్థానాన్ని దక్కించుకుని టాప్ టెన్ లో నిలిచాయి. తిరుపతి సైతం జాతీయ ర్యాంకింగ్ కేటగరీలో బెస్ట్ మెగా సిటీ కేటగరీలో ఆరవ స్థానాన్ని దక్కించుకుంది.ఇదే కేటగరీలో రాజమండ్రి కి 51వ స్థానం దక్కింది.
. కేంద్రం ప్రకటించిన మొత్తం 64 అవార్డుల్లో 6 అవార్డులు రాష్ట్రానికి వచ్చాయి. టాప్ 100 ర్యాంకుల్లో 72 ర్యాంకుల్ని ఏపీ పట్టణాలు కైవసం చేసుకున్నాయి. రాష్ట్రాల పరంగా ఏపీ ఆరో స్థానాన్ని దక్కించుకుంది.(చంద్రబాబు సీఎంగా ఉన్న 2018-19 లో ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ సర్వేక్షన్ లో జాతీయ స్థాయిలో 28 వ స్థానంలో ఉండగా.., జగన్ సీఎం అయ్యాక ఏకంగా 6వ స్థానానికి ఎగబాకింది)