spread news(nellore);-సర్వేపల్లి నియోజక ప్రజల ఆశీసులతో రెండు సార్లు ఎమ్మెల్యే గా విజయం సాధించి ప్రజల మన్ననలను పొందిన నాయకుడు. సుమారు ఈ ఆరు సంవత్సరాలు కాలం లో ప్రజా సమస్యలు తీర్చటంలో ముందున్న నాయకుడు. కరోనా సమయం లో అన్ని తానై ఎందరో నిరుపేదలను ఆదుకున్న నాయకుడు. కరోనా బారిన పడటము తో ప్రజలు ఆయనని త్వరగా కోలుకోవాలని మరల ప్రజల ముందుకి రావాలని పూజలు చేశారు.
వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరిన తరువాత జరిపిన వైద్య పరీక్షల ద్వారా ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకలేదని నిర్ధారణకు వచ్చి, రెండు రోజుల పాటు వైద్యులు పరిశీలించి,తిరిగి ఈ రోజు వైద్య పరీక్షలు నిర్వహించి, ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకలేదని ఆరోగ్యం నిలకడగా ఉందని నిర్ధారణ చేసుకొని 10 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకోవలసిందిగా సూచించి, డిశ్చార్జ్ చేయడం జరిగింది.పూజల ఫలితంగా, మీ ఆశీర్వాదాల వలన కరోనా నుండి తేరుకొని ఎమ్మెల్యే గారు ఆరోగ్యంగా ఉన్నారు.
ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 10 రోజుల పాటు విశ్రాంతి లో ఉన్నా, ఫోన్ లో అందుబాటులో ఉంటారు కాబట్టి అవసరమైన వారు నిస్సంకోచంగా ఎప్పుడైనా, ఏ అవసరమైన ఫోన్ చేసి తమ సమస్యను ఎమ్మెల్యే గారికి తెలియజేసి, పరిష్కరించుకోవచ్చు. 10 రోజుల పాటు విశ్రాంతిలో ఉంటారు కాబట్టి పరామర్శలకు, పలకరింపులకు కాకుండా సమస్య ఉన్నవారు మాత్రమే ఫోన్ చెయ్యండి. విశ్రాంతి సమయం అయిన తర్వాత ఎమ్మెల్యే గారు అందరితో కలుస్తారు.