బెస్ట్ మోటివేటర్ అవార్డు ను అందుకున్న నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్


     స్ప్రెడ్ న్యూస్ (nellore);- నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ ఏర్పడి, ప్రింటర్స్ అందరూ ఏకంగాసమస్యలను పరిష్కరించడమే కాకుండా ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టారు.కరోనా బారినపడి ఎన్నో కష్టాలు పడుతున్న పేద ప్రజలకు  ఆహారాన్ని అందించి ఎంతో సేవ చేశారు. వీళ్లు ఎంతోమందికి రక్తదానం కూడా చేశారు.  నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ చేసిన సేవకు, ఈ సంవత్సరం రెడ్ క్రాస్ వారు రక్త దాతలు ఇచ్చేగౌరవం "బెస్ట్ మోటివేటర్ అవార్డు" ను నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ వారికి ప్రకటించారు.జిల్లా కలెక్టర్ చక్రధర బాబు,రెడ్క్రాస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, చేతుల మీదగా వీరు అవార్డును అందుకున్నారు. ఇది  నెల్లూరు నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ వారికే కాకుండా, నెల్లూరు ప్రజలకు కూడా గర్వకారణం. ఈ కార్యక్రమంలో జిల్లా  ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుండాల ప్రతాపరెడ్డి, సెక్రటరీ అంబటి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు ఎం నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ విజయ్,హరనాధ్ , కమిటీ సభ్యులు మూలం శ్రీనివాసులు, బహుదూర్, నరేష్, మొదలగు వారు పాల్గొన్నారు. మాస్ప్రెడ్ న్యూస్ పత్రిక తరఫున, మాపాఠకుల తరపున అవార్డు అందుకున్న నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ వారికి అభినందనలు.