సినీ గేయ రచయిత నర్రా విజయ్ శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర పై వ్రాసిన పాటల ఆల్బం పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీ ఆనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటగిరి పట్టణం కర్ణకమ్మ వీధికి చెందిన సినీ గేయ రచయిత, చెస్ రాష్ట్ర క్రీడాకారులు శ్రీ నర్రా విజయ్ మొట్టమొదటిసారిగా వెంకటగిరి గ్రామశక్తి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర పై పాటలు రాశారు. ఈ పాటలను సినీ గాయకులతో హైదరాబాదులోని సినీ రికార్డింగ్ థియేటర్లలో పాడి స్తున్నారు. దీనికి సంబంధించిన ఆల్బమ్ పోస్టర్ ను మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా సోమవారం నాడు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు.
ఈ ఆల్బమ్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు గుండుబోయిన శ్రీకాంత్, గొల్లగుంట మురళి, నర్ర విజయ్ పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఆడియో పాటలు సెప్టెంబర్ 9,10 తేదీల్లో జరిగే జాతరకు విడుదల చేయనున్నట్లు శ్రీ నర్రా విజయ్ వెంకటగిరి సామాన్యుడు (సోషల్ మీడియా) కు ఫోన్ ద్వారా తెలిపారు.
వెంకటగిరి సంస్థానాధీశులు, రాజకుటుంబీకులు, సంగీత గేయధార సృష్టికర్త, కి చెందిన పదరాగిణి సంస్థ వ్యవస్థాపకులు, మాజీ వెంకటగిరి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ వి.బి సాయికృష్ణ యాచేంద్ర గారి ఆశీస్సులతో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ. గొల్లగుంట మురళి ఆధ్వర్యంలో ఈ పాటల రికార్డింగ్ హైదరాబాద్ లో పూర్తి చేసుకొని జాతరకు ఆడియో పాటలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని నర్రా విజయ్ తెలిపారు. స్వర్గీయ గుండు బోయిన యశోదమ్మ జ్ఞాపకార్ధం, శ్రీమతి గుండుబోయిన అన్నపూర్ణమ్మ సమర్పణలో, గుండు బోయిన శ్రీకాంత్ నిర్మాత గా, శ్రీ గొల్లగుంట మురళి సహకార పర్యవేక్షణలో, శాండీ అద్దంకి సంగీత దర్శకత్వంలో శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఆడియో పాటలను జాతరకు విడుదల చేస్తామని సినీ గేయ రచయిత శ్రీ నర్రా విజయ్ వెంకటగిరి సామాన్యుడు కు తెలిపారు.