యువతకు వరం ఆయన నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటుఫై క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం


     నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటు, తీసుకుంటున్న చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సహా, స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ జి.అనంతరాము, స్పెషల్‌సెక్రటరీ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్జా శ్రీకాంత్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌ చల్లా మధుసూదన్‌ రెడ్డి సహా ఇతర అధికారులు హాజరు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక కాలేజీ ఉండేలా చూసుకుంటూ రాష్ట్రంలో 30 కాలేజీల నిర్మాణం దిశగా ప్రభుత్వం సన్నాహాలు.


     నైపుణ్యాల అభివృద్ధి, ఉత్తమ మానవవనరులను పరిశ్రమలకు అందించడంలో, పారిశ్రామికాభివృద్దిలో ఈ కాలేజీలు కీలక పాత్ర పోషిస్తాయంటున్న ప్రభుత్వం.కాలేజీలకోసం ఇప్పటివరకూ దాదాపు 20 చోట్ల స్థలాల గుర్తింపు.మిగిలిన చోట్ల కూడా చురుగ్గా స్థలాల ఎంపిక ప్రక్రియ చేస్తున్నామన్న అధికారులు, వేగవంతం చేయాలని సీఎం ఆదేశం. భవనాల నిర్మాణం అత్యంత నాణ్యంగా ఉండాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించిన సీఎం.


     స్కిల్‌ డెవలప్‌ మెంట్‌కాలేజీల్లో కోర్సులు, పాఠ్యప్రణాళిక తయారీపై ఆరాతీసిన సీఎం. వివిధ రకాల కోర్సులకు సంబంధించిన పాఠ్యప్రణాళికను సిద్ధంచేశామన్న అ«ధికారులు. ఫినిషింగ్‌ స్కిల్‌కోర్సులు, ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు.. ఇలా రెండు రకాలుగా స్కిల్‌ కాలేజీల్లో శిక్షణ. మొత్తం 162కిపైగా కోర్సుల ద్వారా ఈ కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధి.ఇందులో 127 కోర్సులు ఫినిషింగ్‌ స్కిల్స్, 35 ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు ఉన్నాయన్న అధికారులు.


     పరిశ్రమల అవసరాలపై సర్వే, ఆసర్వే ప్రకారం కోర్సులను నిర్ణయించామన్న అధికారులు.పాఠ్యప్రణాళిక తయారీలో 4 అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం తీసుకున్నామన్న అధికారులు. సింగపూర్‌ పాలిటెక్నిక్, జీఐజెడ్, వాన్‌  హాల్‌ లారెన్‌స్టెన్‌ (యూనివర్శిటీ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌), డిపార్ట్‌ మెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ భాగస్వామ్యాన్ని తీసుకున్నామన్న  అధికారులు. అలాగే మరో 23 ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యం, వారితో ఎంఓయూలకు సిద్ధమయ్యామని, 


     అలాగే మరో 23 ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యం, వారితో ఎంఓయూలకు సిద్ధమయ్యామని, మరో 35 సంస్థలతో చర్చలు నడుస్తున్నాయని వివరించిన అధికారులు ల్యాబ్‌ ఏర్పాట్లు, పాఠ్యప్రణాళికలో వీరి సహకారం తీసుకుంటున్నామన్న అధికారులు. ఎంఓయూలకు సిద్ధమైన వాటిలో డెల్, హెచ్‌పీ, టీసీఎస్, ఐబీఎం, బియోకాన్, టాటా తదితర కంపెనీలు ఉన్నాయి. హై ఎండ్‌స్కిల్స్‌తోపాటు ప్రతి కాలేజీలో కూడా ఏసీలు, ప్లంబింగ్, భవన నిర్మాణం తదితర పనులపైన యువతకు శిక్షణ ఇచ్చే ఇవ్వాలన్న సీఎం.