‘హిందూస్థాన్‌ టైమ్స్‌’ ఆంగ్ల దినపత్రికకు తాజాగా సీఎం జగనన్న గారు ఇచ్చిన ఇంటర్యూ


హిందూస్థాన్‌ టైమ్స్‌:- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కార్య నిర్వాహక, న్యాయ, శాసన విభాగాలకు మూడు రాజధానులు ఉండాలనే అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉంది. చర్చించుకోవడం సబ్‌ జ్యుడిస్‌ అవుతుంది. అయినప్పటికీ మీ ఈ ప్రయత్నం వెనుక పాలనాపరమైన ఉద్దేశ్యం ఏమిటి?


ఏపీ సీఎం :- మూడు రాజధానులు అనేది ఒక సామాన్యుడి ఆలోచన. రాజధాని విధుల విభజించాం.  విశాఖపట్నం నుంచి కార్యనిర్వాహక, అమరావతి నుంచి శాసన, కర్నూలు నుంచి న్యాయ వ్యవస్థ విధులు నిర్వహణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ కూడా రాజధాని విధులు విభిన్న ప్రాంతాలకు కేటాయించవచ్చునని చెప్పింది. అన్ని విధులూ ఒకే చోట నుంచి ఎందుకు నిర్వహించాలి? చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో విధులన్నింటినీ కేంద్రీకరించడం వల్ల  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండు సార్లు తీవ్రంగా నష్ట పోయింది.రాజధాని నిర్మాణానికి రూ.  లక్ష కోట్లు కావాలని గత ప్రభుత్వం చెప్పింది. రైతుల నుంచి సేకరించిన, సమీకరించిన (పూలింగ్‌) 33000 ఎకరాల భూమిలో మెగా భవన నిర్మాణాలకు ఏ మాత్రం అనువుగా లేని చోట ఒక నగరాన్ని నిర్మించడం కన్నా ఆయన (చంద్రబాబు) 500 ఎకరాల్లో మరొక చోట నిర్మాణానికి ప్రయత్నించి ఉండొచ్చు.


ప్రశ్న:- శివరామకృష్ణన్‌ నివేదిక ప్రకారం రాజధాని ఏర్పాటుకు కేవలం 500 ఎకరాలు సరిపోతే ఆయనకు(చంద్రబాబు) 33000 ఎకరాలు ఎందుకు కావాల్సి వచ్చింది?


ఏపీ సీఎం :- అమరావతిలో జరిగిన భూ లావాదేవీలపై ఒక ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది. నాకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మనుషుల బినామీ లావాదేవీలను వెలికి తీసే పనిలో ఉంది. ఆ ప్రాంతంలో స్వప్రయోజనాలను ఆశించి పబ్బం గడుపుకోవాలనే కొందరు వ్యక్తులు పేద రైతుల నుంచి భూములను కొనుగోలు చేశారు. ఆ తరువాతనే రాజధానిని అక్కడ పెడుతున్నట్లు ప్రకటన వెలువబడింది. భూకుంభకోణం చోటు చేసుకుంది. కారు చౌకధరలకు కొనుగోలు చేసిన వారు వేలాది కోట్ల రూపాయల లబ్ది పొందారు.


కేవలం ఒక వర్గానికి లాభం చేకూర్చడం కోసం గత ప్రభుత్వం చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తప్ప మరొకటి కాదు. అభివృద్ధి అనేది ఒకే చోట కాకుండా దానిని వికేంద్రీకరించి రాష్ట్రమంతటికీ విస్తరింప జేస్తే అన్ని చోట్లా సమీప భవిష్యత్తులో గ్రోత్‌ సెంటర్లుగా విరాజిల్లుతాయి. ఉదాహరణకు కేరళ రాష్ట్రంలో ఎన్ని పెద్ద నగరాలున్నాయి? లేవే! అయినప్పటికీ ఆ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే అనేక ప్రామాణికాల్లో ముందంజలో ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి విస్తరింప జేస్తే విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, తిరుపతి మరి కొన్ని నగరాలు అభివృద్ధి క్లస్టర్‌లు ఉంటాయి. పోర్టుల అభివృద్ధి కూడా జరుగుతోంది. వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న మధ్య కోస్తాలో అగ్రోలాజిస్టిక్‌ పార్కును కలిగి ఉండొచ్చు, అన్నీ కలిసి అభివృద్ధి దిశగా ముందుకు వెళతాయి.


ప్రశ్న:- చంద్రబాబును చులకన చేయడం కోసం అమరావతిని మీరు నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలకు ఏం సమాధానం చెబుతారు? టీడీపీ నేత కూడా మీ పరిపాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షంపై గూఢచర్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.


ఏపీ సీఎం :- అది పూర్తిగా అర్థరహితం. అమరావతి గురించే మేం ఎందుకు ఆలోచించాలి? యావత్‌ రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలనేది మా అభిమతం. అమరావతిని మేం వదలి వేయం. అక్కడి నుంచి శాసనసభ పని చేస్తుంది. దేశంలో ఏదైనా అంశంపై నిపుణులు ఇది తప్పుడు విధానం అని చెప్పినపుడు ఎందుకు పరిగణించరు? (గౌరవించరు?) మన దేశంలో ఏదైనా ఒక విధానంపై రెఫరెండం చేసే (ప్రజాభిప్రాయ సేకరణ) విధానం లేదు. అందువల్లనే నిపుణులు వ్యక్తం చేసే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడమే ఇక మిగిలి ఉన్న మార్గం. రెఫరెండమ్‌ కనుక అమలులో ఉంటే మేం ఆ విధానాన్ని కచ్చితంగా అనుసరించి ఉండేవాళ్లం. అభివృద్ధి వికేంద్రీకరణ అనే మా విధానానికి ప్రజలు మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారని మేం పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అభివృద్ధి వికేంద్రీకరణపై మేం కనుక రెఫరెండమ్‌ నిర్వహించి ఉంటే ఆ 29 గ్రామాల్లోని పది వేల మంది రైతులు మినహా యావత్‌ రాష్ట్ర ప్రజలు మా వెనుక మద్దతుగా నిలబడి ఉండే వారు. ఆ రైతులు కూడా ఎందుకు వ్యతిరేకిస్తారో కారణాలు విస్పష్టం                                                        (కొరవ పార్ట్ 2 లో)