ఏపీ మాజి సిం చంద్రబాబునాయుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో వాహనానికి ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో తెలంగాణలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ఘటన జరిగింది. తృటిలో ప్రమాదం నుండి బయటపడిన చంద్రబాబు, ఎస్కార్ట్ వాహనానికి ఆవు అడ్డు రావటంతో ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వెసాడు, వెనుక ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఎస్కార్ట్ వాహనం వెను వాహనంలో చంద్రబాబుకూర్చుని ఉన్నారు. వాహనం ముందు భాగం దెబ్బతింది కారును అక్కడ వదిలేసి వెళ్లారు.చంద్రబాబుకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడలోతెలుగుదేశం నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాటలాడిన చంద్రబాబు ఎన్నికలు ఎపుడైనా రావొచ్చని అందుకు తయారుగా ఉండాలని చెప్పారు . నెట్టుతున్నారని రైతుల పంపు సెట్లకు మోటర్లు బిగించాలనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెతిరేకిస్తున్నానని అన్నారు .
వైసీపీ అధికారంలోకి వచ్చాక 15 నెలల్లోనే రెండుసార్లు కరెంటు బిల్లులు పెంచారని టీడీపీ హయాంలో ఐదేళ్లలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదనివైసిపి పార్టీ చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటని అన్నారు . రైతుల జివితాలతో అట్లాడొద్దని , 18 లక్షల రైతుల జీవితాలతో ప్రభుత్వం చలగాటమాడితే చూస్తూఉరుకోమని ఆసమర్థపాలనతో రాష్రాన్ని కిందకు లాగారని అన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలోప్రమాదం జరిగింది .