దివంగత నేత,మాజి ముఖ్యమంత్రి, మహానేత, డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి, వర్ధంతిని పురస్కరించుకొని నారాయణరెడ్డి ట్రస్టు తరఫున నెల్లూరు కొండయ్య పాలెం రోడ్డు లోని జనహిత వాత్సల్యట్రస్టుకు చెందిన విద్యార్థులకు, వృద్ధులకు, బుధవారం ఉదయం అల్పాహారం వితరణ చేశారు. అధ్యక్షులు నారాయణరెడ్డి, విక్రమసింహపురి ఈ నివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ విజయ కృష్ణ రెడ్డి, ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు కనీస వసతులు ఉండాలని ఆకాంక్షించారు. మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.
కాకతాళీయంగా తమ తండ్రి నారాయణ రెడ్డి వర్ధంతి కూడా ఇదే రోజున చెప్పారు.ఇరువురి జ్ఞాపకార్థం అల్పాహారం చేసినట్లు తెలిపారు. అందరూ బాగా చదువుకోవాలని రైతులు ఆనందంగా ఉండాలని వైఎస్ ఆకాంక్షించారు అని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోనే ఆదర్శవంతమైనవని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు చెప్పాలంటే సుమారు రెండు గంటలు పడుతుందని అభిప్రాయపడ్డారు. విద్యా రంగానికి సంబంధించిన మోడల్ స్కూల్స్, పదో తరగతి తరగతి వరకు మధ్యాహ్న భోజనం అందించడం, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు వంటి, అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు.
తన మిత్రులతో కలిసి అల్పాహారం అందించిన విజయ్ ప్రసాద్ రెడ్డి, కృష్ణారెడ్డి, అక్కడ విద్యార్థులకు pens కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల స్వామి జూనియర్ కళాశాల అధ్యాపకులుచొప్ప వరకు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సిబ్బంది, ఘనంగా నివాళులు అర్పించారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరినిమా స్ప్రెడ్ న్యూస్ పాఠకుల తరపున అభినందిస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం.