సేవా భావంతో పనిచేసే సంస్థలకు ప్రజల ఆదరణ దాతల సహకారం ఉంటుందని నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఎపియుడబ్ల్యూజె రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ అన్నారు .గురువారం నెల్లూరు వేదాయపాళెంలోని స్వర్ణ దీపం దివ్యాంగుల చారిటబుల్ ట్రస్టులో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయటము శుభపరిమాణము అని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో దాతలకు సేవ పరాయణులకు కొదవలేదని దొడ్ల సుబ్బారెడ్డి పొనకా కనకమ్మ వెన్నెలకంటి రాఘవయ్య ఏనుగు పట్టాభిరామిరెడ్డి మహానుభావులెందరో తమ జీవితాలను అనాథల కోసం త్యాగం చేశారని కొనియాడారు .వారి స్ఫూర్తితో సేవా సంస్థలు పనిచేయవలసిన అవసరం ఉందన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సంస్థలు స్వంతంగా కుటుంబం కోసం ఏర్పాటు చేసుకుని స్వలాభం కోసం స్వాహా సంస్థలుగా పనిచేస్తున్నాయని అన్నారు.
దాతలతో నిధులు పొందుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారం తీసుకుంటూ సేవాభావాన్ని మరిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .కరువు పరిస్థితుల్లో అనాథలను పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.ప్రమీలారెడ్డి వెంకట్రెడ్డి నిత్యావసర వస్తువులను ట్రస్టుకు అందజేశారు .ఈ కార్యక్రమంలో డి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు .