బిగ్ బ్రేకింగ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు !


ఈసీ రమేష్ కుమార్ కామెంట్స్...


    మూడు దఫావులు ఎన్నికలు.ఎంపీటీసి, జడ్పీటిసి, ఒక విడుతగా ,మున్సిపల్ ఒక విడతగా ,పంచాయితీలు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించబోతున్నాం.ఎన్నికల కోడ్ తక్షణమే అమలోకి వస్తుంది.ఎంపీటీసి / జడ్పీటీసీ కి ఇవాళ నోటిఫికేషన్.*ఈనెల 9 నుండి 11 వరుకు నామినేషన్స్,21 న పోలింగ్,24 కౌంటింగ్ *మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్.ఈనెల 11 నుండి 13 వరుకు,నామినేషన్స్. 23 పోలింగ్, 27 కౌంటింగ్ ఉంటుంది.


    గ్రామపంచాయితీలు రెండు ఫేజులుగా నిర్వహిస్తున్నాము.ఫేజ్ 1 - 17 నుండి 19 వరుకు నామినెషన్స్..27 న పోలింగ్, అదే రోజు కౌంటింగ్..ఫేజ్ -2 ఈనెల 19 నుండి 21 వరుకు నామినేషన్స్ 29 న పోలింగ్, 29 నే కౌంటింగ్....ఓటర్లని ప్రభావితం చేసే ఏ ప్రభుత్వ స్కీమ్స్ అయినా అమలు నిలుపుదల చేయాలి.బదిలీలు, నియామకాలు నిషేదం.ఎన్నికలు సజావుగా జరపడానికి,కలెక్టర్లకి, ఎస్పీలకు అధికారాలు ఇచ్చాం.


    స్వేచ్చగా, హింసకి తావులేకుండా ఓటు హక్కు వినియోగించుకొనేలా అందరూ సహకరించాలి.ప్రభుత్వ భవనాలపై ఉన్న రంగుల గురించి ఇప్పటికే హైకోర్ట్ లో ఉంది కాబట్టి దానిపై మేము ప్రత్యేక చర్యలు తీసుకోము.కార్యాలయాలకు రంగుల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాం..సిబ్బంది కొరతలేదు.. అత్యవసరం అయితే అంగన్ వాడి వర్కర్స్ ని వాడుకుంటాం.ఈసీ రమేష్ కుమార్,సంచలన కామెంట్స్ .