జర్నలిస్టుల సమస్యల గురుంచి జర్నలిస్టుల నాయకులు ఎం మాట్లాడారు


     (స్ప్రెడ్ న్యూస్ ) నెల్లూరు జిల్లా నుంచి వెంకయ్య నాయుడు తో గూగుల్ మీట్ కార్యక్రమంలో. డక్కన్ క్రానికల్ ప్రతినిధి రాజశేఖర్,  సాక్షి టీవీ ప్రతినిధి అమర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్, ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ సురేష్ ఈ టీవీ ప్రతినిధి రాజా రావు, హన్స్ ఇండియా ప్రతినిధి ప్రసాద్,  ఏబీఎన్ ప్రతినిధి మహేష్, జమీన్ రైతు రహీం, act గోవింద స్వామి,  ప్రజాశక్తి ప్రతినిధి బాలకృష్ణ , హెచ్ఎంటీవీ ప్రతినిధి నరసింహులు, టీవీ 9 మురళి,  ఏపీ 24 x7 ప్రతినిధి నరేష్,  భారత్ టుడే ప్రతినిధి మురళి,  టీవీ 5 ప్రతినిధి రాజేష్ , హిందు మురళి,  లాయర్ ప్రతినిధి మద్దురు శ్రీనివాసులు , విశాలాంధ్ర ప్రతినిధి దయశంకర్, జర్నలిస్ట్ ఫ్రెండ్స్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



    కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో జర్నలిస్టులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరు నగరంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తే ఎంతోమందికి సొంత ఇల్లు పొందేందుకు సహాయం చేసినట్లు అవుతుందని  ఈ సహాయం చేయాలని భారత్ టుడే ప్రతినిధి మురళి ఉప రాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు.విధి నిర్వహణలో నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టులు అనారోగ్యం పాలవుతున్నారని వారికి ప్రత్యేక హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఏపీ 24 x7 నరేష్ ఉప రాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు. కరోనా వైరస్ మూలంగా జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని జర్నలిస్టులను ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజాశక్తి బాలకృష్ణ వెంకయ్య నాయుడు కి విజ్ఞప్తి చేశారు.


భారత ఉపరాష్ట్రపతి ఔదార్యం


     నెల్లూరు జిల్లాలో కరోనా తో  మృతి చెందిన జర్నలిస్టులకు 50 వేలు అందిస్తామని  భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రకటించారు, కరోనా మహమ్మారి మూలంగా నెల్లూరు జిల్లాలో పలువురు జర్నలిస్టులు కరోనా వైరస్ బారిన పడ్డారని వారిలో కొందరు మృతిచెందారని జిల్లా జర్నలిస్టులు వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకు వెళ్లారు.*దీంతో వెంటనే స్పందించిన భారత ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ కరోనా వైరస్ తో నెల్లూరు జిల్లాలో మృతి చెందిన జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 50, 000 వంతున అందజేస్తున్నట్లు ప్రకటించారు.