అమరావతి లో జరిగిన అక్రమాలను హైకోర్టుకు నివేదించిన అడ్వకేట్ జనరల్!


     అమరావతి పేరిట జరిగిన అక్రమాలను హైకోర్టుకు నివేదించిన అడ్వకేట్ జనరల్.రాజధాని విషయంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే చంద్రబాబు మరియు ఆయన మంత్రివర్గ సహచరులు, టిడిపి నేతలు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు, చంద్రబాబు సతీమణి కి చెందిన హెరిటేజ్ పేరుమీద కూడా భూముల కొనుగోళ్లు జరిపారు, అప్పటి మంత్రి నారా లోకేష్ తన బినామీల పేరుమీదభూములుకొనుక్కున్నారు.లింగమనేని రమేష్ అమరావతి ప్రాంతంలో160 ఎకరాలు కొన్నారు,ఆయన ఇంట్లోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నివసించారు.


     నేను గతంలో హైటెక్ సిటీ ప్రాంతంలో ఒక ఎకరం లక్ష రూపాయలకు కొని, ఆ తరువాత దాన్ని 30 కోట్ల కి అమ్ముకున్నాను అంటూ చంద్రబాబు గతంలో చెప్పాడు.అదే తరహాలో, అమరావతి ముసుగులో భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని భావించి 4,070 ఎకరాల భూమిని తమ బంధువులు, తమ పార్టీ ముఖ్య నేతల ద్వారా బాబు కొనిపించుకున్నాడు.ఇందులో భాగంగా ,తుళ్లూరు ప్రాంతంలో, కొందరు టిడిపి నేతలతో చేతులు కలిపి రికార్డులు తారుమారు చేసిన  కేసులో ,ఇప్పటికే తుళ్లూరు తాసిల్దార్ సుధీర్ బాబు జైలుకు వెళ్లగా. గతంలో సిఆర్డిఏ డిప్యూటీ కలెక్టర్ గా  పనిచేసిన మాధురి  కేంద్రంగా అనేక అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ జరగడంతో ఆవిడ కూడా జైలు కి వెళ్ళింది.


    చంద్రబాబు వద్ద గతంలో పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో, సిఐడి అధికారులు సోదాలు జరపగా, రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన డైరీ ఒకటి పట్టుబడింది, బాబు దగ్గర పనిచేసిన వాడి ఇంట్లోనే ఇన్ని అక్రమ లావాదేవీలకు రూపకల్పన జరిగితే, ఇక చంద్రబాబుపై విచారణ మొదలైతేఅమరావతి పేరిట ఎన్ని లక్షల కోట్ల అక్రమ లావాదేవీలు బయట పడతాయో.