చంద్రబాబు మొదట తమ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి


    విశాఖ జిల్లాలో తెలుగుదేశాని కున్న నలుగురు ఎమ్మెల్యేలతో ముందు రాజీనామా చేయించాలన్న హోంమంత్రి సుచరిత.చంద్రబాబు మొదట తమ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి.రాజధాని తరలింపు కాదు, అభివృద్ధీ వికేంద్రీకరణ మాత్రమే చేస్తున్నాం.రాజధాని రైతులకు కౌల్ పెంచిన ఘనత సీఎం జగన్ గారికి ఉంది.దళితులపై అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులను జగన్  ప్రభుత్వం సహించదు.కాశీబుగ్గలో దళితుడిని కాలుతో తగ్గిన సీఐను సస్పెండ్ చేశాము.రాజామండలం, చీరాల సంఘటనలకు కారణమైన అధికారులను సైతం సస్పెండ్ చేశాము.ఘటనకు కారణమైన పోలీసులపై అట్రాసిటీ కేసులు పెట్టాము.ఏదైనా సంఘట జరిగితే ఇంత వేగంగా చర్యలు తీసుకున్న సందర్భం గతంలో లేదు.దళితుడిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని మాట్లాడిన చరిత్ర చంద్రబాబుది.ఆదినారాయణరెడ్డి, చింతమనేని దళితులను కించపర్చితే చంద్రబాబు మందలించలేదుమా ప్రభుత్వంలో వరకట్న వేదింపులు, మహిళలపై నేరాలు తగ్గాయి.రాష్ట్రపతి ఆమోదం లభించకపోయినా 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం.ప్రెండ్లీ పోలీసింగ్ మా ప్రభుత్వ ధ్యేయం. పోలీసులు కూడా సమన్వయం తో పనిచేయాలి.