ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, సంబంధిత శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్ర, తదితరులు హాజరు.ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, దార్శినికత అంతా జాతీయ నూతన విద్యా విధానంలో కనిపించిందన్న అధికారులుఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెనల ద్వారా పెద్ద చదువులకు అండగా నిలుస్తున్నాం.ఇప్పుడున్న 32.4 శాతం నుంచి గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో 90 శాతానికి తీసుకెళ్లాలి.పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకు రావాలి.మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్‌షిప్‌ను చేర్చాం.దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ కూడా ఉంటుందిదాన్ని డిగ్రీ ఆనర్స్‌గా పరిగణిస్తాం.అదనంగా ఏడాది అనేది విద్యార్థి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది.
అడ్మిషన్లు పొందినప్పుడే సాధారణ డిగ్రీ కావాలా? లేదా ఆనర్స్ డిగ్రీ కావాలా? అన్న దానిపై ఐఛ్చికాన్ని తీసుకుంటాంఇక బీటెక్ డిగ్రీలకు సంబంధించి 4 ఏళ్లలో కూడా తప్పనిసరి అప్రెంటిస్‌షిప్ ఉంటుందిఅదనంగా 20 క్రెడిట్స్ సాధించిన వారికి ఆనర్స్ డిగ్రీ వస్తుంది.చదువులు చెప్పే విధానంలో మార్పులు రావాలి.మంచి పాఠ్య ప్రణాళిక వల్ల డిగ్రీలకు విలువ ఉంటుంది.ప్రభుత్వ కాలేజీలను మెరుగు పరుద్దామన్న ఆలోచన గతంలో ఎవ్వరికీ రాలేదు.ఇప్పుడు ప్రభుత్వ కాలేజీల్లో అత్యున్నత ప్రమాణాలతో బోధన అందించాలని మనం ప్రయత్నాలు చేస్తున్నాం.అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
పాత మెడికల్ కాలేజీలను మరమ్మతు చేసి వాటిలో నాడు – నేడు కార్యక్రమాల కోసం రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం.కాలేజీల్లో కూడా నాడు – నేడు కార్యక్రమాలు చేయాలని సీఎం ఆదేశం.అక్టోబరు 15న కాలేజీలు తెరవాలని నిర్ణయం.సెప్టెంబరులో సెట్‌ల నిర్వహణ పూర్తి కావాలని నిర్ణయం.కాలేజీలు తెరిచిన తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని ఆర్థికశాఖ అధికారులకు సీఎం ఆదేశం.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సెల్‌ఫోన్ వెలుగులో ఆపరేషన్లు ఎందుకు చేయాల్సి వచ్చింది?
ఎలుకలు కొరికి శిశువు చనిపోయే పరిస్థితులు ఎందుకు వచ్చాయి?
జనరేటర్లు పని చేయని పరిస్థితి ఎందుకు వచ్చింది?