నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టు మరియు పోర్టు ఆధారిత పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల కోసం చిల్లకూరు మండలం, నవనీత పబ్లిక్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ కమ్ క్లినిక్ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు గారు, గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద రావు గారితో కలిసి పాల్గొన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కరోనా మహమ్మారిని నివారించేందుకు అన్ని విధాలా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది.ప్రజలకు అవసరమైన వైద్యం, క్వారంటైన్ సెంటర్లలో వసతి సదుపాయాలు, కరోనా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. కృష్ణపట్నం పోర్టు మరియు పోర్టు ఆధారిత పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, సిబ్బంది కోసం క్వారంటైన్ సెంటర్ కమ్ క్లినిక్ ఏర్పాటు చేయాలన్న జిల్లా కలెక్టర్ గారి ఆలోచన అభినందనీయం.
కార్మికుల కోసం ఏర్పాటుచేసిన క్వారంటైన్ సెంటర్ క్లినిక్ లో అవసరమైన వసతి, వైద్య సదుపాయాలతో పాటు, విశాల భవనంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో క్వారంటైన్ సెంటర్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్వారంటైన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన కృష్ణపట్నం పోర్టు, ధర్మల్ విద్యుత్ కేంద్రాలు, పెన్నా సిమెంటు, పామాయిల్ కంపెనీల యాజమాన్యాలకు ధన్యవాదాలు.కరోనా నేపధ్యంలో జిల్లా కలెక్టర్ గారి సారధ్యంలో జిల్లా యంత్రాంగం, వైద్య సిబ్బంది, పోలీసు శాఖ, పారిశుద్ధ్య విభాగం, అన్ని స్థాయిలలోని అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు సమర్ధవంతంగా అహర్నిశలు శ్రమించి కరోనా నివారణకు తోడ్పాటునందించారు.
కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందకుండా, అందరం కలిసి పరస్పర అవగాహనతో నివారించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుందాం.