ప్రజలకోసం పుట్టి, ప్రజల పక్షాన నిలిచిన,ఆనతి కాలంలొ ప్రజా గుర్తిపు తెచ్చుకొని,ప్రజా రంజక పాలన అందించి ప్రజా ప్రయాణంలో అశువులు బాసిన అందరి బంధువు.దివంగత నేత డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఈరోజు ఏపీ ప్రభుత్వం ఈరోజు రైతు దినోత్సవం గా ప్రకటించారు.దివంగత నేత డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారిని తెలుగు ప్రజలు అందరు పార్టీలకు అతీతముగా మననము చేసుకుంటూ ఉన్నారు.మరసి పోలేని పాలన అందించిన దివంగత నేత డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి పాలన అందించాలని ఏపీ అభివృధికి పాటు పడుతున్న వైస్ జగన్ మోహనరెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు.రాజశేఖర్ రెడ్డి గారిజన్మదినాన ఆయన ఆత్మకు శాంతి కలగాలని తెలుగు రాష్ట్రాల ప్రజల తరుపున మా స్ప్రెడ్ న్యూస్ పత్రిక తరుపునకోరుకుంటున్నాము.
జనహితమే నీ యోగంగా,జనం కొరకు నీ యాగం,అండదండవై నిలబడ్డావ్.గుండెగుండెలో కొలువైనావ్,ఓ మడమ తిప్పని యోధుడా,మాటిస్తావా రాజన్న,మళ్ళీవస్తానని కోరుకొన్న ప్రజలకోసం.1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి. మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టారు ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవి పొందారు ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిననూ ఆ మూడు మంత్రిమండళ్లలో స్థానం సంపాదించారు.
2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర మరియు ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది. ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు.ఆ రూపం మన తెలుగు వారి గుండెల్లో ఎపుడూ ప్రతిధ్వనిస్తుంది.