విజయవాడలో ఆర్.అండ్.బి. చీఫ్ ఇంజీనీర్ నయ్యుముల్లా గారితో గూడూరు ఫ్లైఓవర్ పనులను పూర్తి వేగంగా చేయాలి అనే దృఢ సంకల్పంతో వారిని మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు. గూడూరు ఫ్లైఓవర్ ను 2009 వ సంవత్సరం లో వై.యస్.ఆర్.రాజశేఖర్ రెడ్డి గారు 39 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. అది తూర్పు పడమర టౌన్ వైపు మాత్రమే కాకుండా నేషనల్ హైవేకు సరాసరిగా వెంకటగిరి, తిరుపతి అలాగే కడప జిల్లాకు, రాజంపేట కు వెళ్లాలి అన్నా అటువైపు నుండి వెళ్లాలి చాలా మంది ప్రజలకి అన్నివిధాలా అవసరపడుతున్నది.
ముఖ్యంగా గూడూరు నందు టౌన్ వన్ వైపు ప్రభుత్వ ఆఫీసులు, మార్కెట్లో, బస్టాండ్లు ఉన్నాయి టూ టౌన్ వైపు ఎక్కువ విద్యాసంస్థలు,ఎక్కువ ఇల్లు అటువైపు ఉండడం జరిగింది కనుక ఇది చాలా అవసరం అని దినిని కట్టడం జరిగింది.గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇది కేవలం వై.యస్.ఆర్.రాజశేఖర్ రెడ్డి గారి మానసిక పుత్రిక అనే ఉద్దేశంతో ఇది ఏమాత్రం అభివృద్ధి చెందకుండా ఆపివేశారు.వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చిన ఒక సంవత్సర కాలంలో రెండుసార్లు టెండర్లకు పిలవడం కూడా జరిగింది,.
ఎవరు రాకపోవడం ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మనసు పెట్టి దాన్ని పూర్తి చేస్తాను అని గూడూరు ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఈ విషయం గురించి ఎమ్మెల్యే గారు ఆర్.అండ్.బి. చీఫ్ ఇంజీనీర్ నయ్యుముల్లా గారితో మాట్లాడి గూడూరు ప్రజలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు కనుక దానిని నామినేషన్ పద్ధతిలో దానిని మీలో ఎవరో ఒక్కరు పూర్తి చేసి గూడూరు ప్రజలకు అంకితం చేయాలని వారిని కోరడం జరిగింది.
ఆర్.అండ్.బి. చీఫ్ ఇంజీనీర్ నయ్యుముల్లా గారు తప్పనిసరిగా ఈ సారి గూడూరు ఫ్లైఓవర్ ను పూర్తి చేసి ఇస్తామని గూడూరు శాసనసభ్యులకు చెప్పడం జరిగింది.