ఉమ్మడి ఏపీ నుంచి నవ్యాంధ్ర వరకు ముఖ్యమంత్రులుగా రాయలసీమకు చెందినవారే ఎక్కువ. కానీ వారెవరూ సీమ ప్రజల నీటి కష్టాలు పట్టించుకోలేదు. పక్కనే ఉన్న కృష్ణా జలాలను నిరంతరం కరువు వాత పడుతున్న నాలుగు జిల్లాలకు అందించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించిందే లేదు.డా. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంతో పాటు హంద్రీ-నీవా, గాలేరు నగరి లాంటి పథకాలను చేపట్టి చరిత్రలో నిలిచిపోయారు.
ఇప్పుడు రాష్ర్ట ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు తోడ్పడే ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ చేపడుతున్నారు. అంతరాష్ర్ట వివాదాలను అధిగమిస్తూ, సాంకేతిక సమస్యలను దాటుకుంటూ ప్రాజెక్ట్ పనులకుటెండర్లు పిలిచే దశకుచకచకాచేరుకుంది.రాయలసీమలోనే కాదు రాష్ర్టంలోనే ఇంతపెద్ద ఎత్తపోతల పథకం నిర్మించనే లేదు. ఇప్పటి వరకు తెలంగాణలో ప్రపంచంలోనే పెద్దదైన బహుళ, భారీ ఎత్తిపోతల పథకం 2 టిఎంసీల పంపింగ్ సామర్థ్యంతో నిర్మించి ఇప్పుడు మరో టిఎంసి సామర్థ్యం విస్తరిస్తుండగా (కాళేశ్వరం పూర్తిస్థాయిలో నిర్మిస్తే రోజుకు 3 టిఎంసీలు పంప్ చేస్తారు) ఆంధ్రప్రదేశ్ లో చేపడుతున్న రాయలసీమ పథకం కూడా అంతే సామర్థ్యంతో చేపడుతున్నారు.
రోజుకు 3 టిఎంసీల నీటిని పంపింగ్ చేయడమంటే అసాధారణమైనది. ఇంతవరకు రాష్ర్టంలో ఇంత పెద్ద పంపింగ్ ప్రాజెక్ట్ నిర్మించనే లేదు. ఏపీలో అతిపెద్దదిగా భావించే హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం మొత్తం ఏడాది పంపింగ్ సామర్థ్యం 40 టిఎంసీలు మాత్రమే.అదే విధంగా పట్టిసీమ, ముచ్చుమర్రి, కొండవీటి వాగు, పురుషోత్తపట్నం లాంటి ఎత్తిపోతల పథకాలు గతంలోనే పూర్తయ్యాయి. వీటితో ఏమాత్రం పోలికలేని విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా సంగమేశ్వర వద్ద నిర్మిస్తున్నారు.
ఇంత వరకు ఏ ప్రభుత్వానికి, ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన ఆయనకు వచ్చిందే తడవుగా శాస్ర్త, సాంకేతిక సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేయించాక పని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే రాయలసీమలో అత్యధిక ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించడమే కాకుండా, శతాబ్దాలుగా కరువువాత పడుతున్న వారిని శాశ్వతంగా ఆదుకునేందుకు సాధ్యమవుతుంది.
ముఖ్యమంత్రి ముందు చూపు – ఏపి చరిత్రలోనే అరుదైన ప్రాజెక్ట్.ఈ ప్రాజెక్ట్ తో రాయలసీమ రత్నాలసీమ గా మారబోతున్నది