జాతీయ సేవా పథకం ఆద్వర్యం లోయోగా !


     విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం  ఆద్వర్యం లోవివిధ సేవా కార్యక్రమాలు జరిగిన సంగతి అందరికి తెలుసు.విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంఆధ్వర్యములో యోగ క్లాసులు ఆన్లైన్లో నిర్వహించి మరో ఘనత సాటారు.యోగ సాధనతో కరోనాను నివారించే ఇంన్నిటిని పెంచుకోవచ్చు.విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం  జాతీయ సేవా పథకం  ఆద్వర్యం లో, వివిధ రకాల  ప్రాణాయమాలు, మరియు సరియైన పద్దతిలో శ్వాసను, తీ సుకోవటం తో కరోనా ను జయించవచ్చు, అనే అంశము మీద ప్రత్యేక ఆన్ లైన్  వెబినార్ ను నిర్వహించారు.



    .ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఆర్. సుదర్శనరావు గారు ముఖ్యఅతిధిగా పాల్గొని వెబినార్ ను ప్రారంభించారు. యోగ మరియు ఆయుర్వేదం అనే రెండు ముఖ్యమైన అంశాలు మన దేశ సాంప్రదాయకంగా ఎంతో ప్రాముఖ్యమైనవి అని అన్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తం యోగ ను దైనందిన జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకున్నారని అన్నారు.ఈ విద్యాసంవత్సరము నుంచి విశ్వవిద్యాలయంలో యోగ మీద ఒక ప్రత్యేకమైన 3 నెలల డిప్లొమా/సర్టిఫిఫికేట్ కోర్స్ ను ప్రారంబించామని అన్నారు.



     ఈ కార్యక్రమంలో  ఏవిధంగా వివిధ రకాల ప్రాణాయామాలు  ఊపిరితిత్తుల సామర్ధ్యము మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించ్చవచ్చునో శాస్త్త్రీయ పద్దతిలో వివరించారు.  ఈ పద్దతులను విపులంగా  ప్రాక్టికల్ గా యోగా నిపుణురాలైన స్వప్న గారు చూపించారు  .యోగా , కుటుంబం తో యోగా అనే అంశంపై ఆన్ లైన్ వెబినార్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్. విజయ కృష్ణా రెడ్డి గారు నిర్వాహకులు, NSS సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, సుమారు 50 మంది విశ్వవిద్యాలయ అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.