నెల్లూరు ప్రజలకు మంచి శుభవార్త !


  ముఖ్యమంత్రి చేతుల మీదుగా, నెల్లూరు జిల్లాల స్కిల్ కాలేజీ ప్రారంభోత్సవం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


    అక్టోబర్ లో లాంఛనంగా 5 జిల్లాలలో  గాంధీ జయంతి రోజున  5 స్కిల్ కాలేజీలతో శ్రీకారం.* చదువు విలువను ప్రపంచానికి చాటిన గాంధీ జయంతి రోజున  5 స్కిల్ కాలేజీలతోప్రారంభానికి శ్రీకారం.ముఖ్యమంత్రి చేతుల మీదుగ  కడప,ఏలూరు, ఒంగోలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో స్కిల్ కాలేజీల ప్రారంభోత్సవం.మిగతా 25 స్కిల్ కాలేజీలు కొత్త ఏడాది జనవరిలోనే లాంఛనంగా ప్రారంభానికి సన్నద్ధం. అనుకున్న సమయానికి అనుకున్నవి పూర్తి చేసేలా కార్యాచరణ.30 కాలేజీలపై పర్యవేక్షణకు  'ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్' ఏర్పాటు.


    అక్టోబర్ లో  లాంఛనంగా స్కిల్ కాలేజీల ప్రారంభం , పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్య, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన  నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష. ముఖ్యమంత్రి చేతుల మీదుగా కడప,ఏలూరు, ఒంగోలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో స్కిల్ కాలేజీల ప్రారంభోత్సవం.


     30 కాలేజీలపై పర్యవేక్షణకు  'ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్' ఏర్పాటు. అక్టోబర్ లో ప్రారంభించే 5 కాలేజీలు సహా అన్ని కాలేజీల డిజైన్లు, లేఔట్లకు తుది మెరుగులు.గతేడాది చివరిన నైపుణ్యాశాఖ బృందం భువనేశ్వర్ లోని సెంచూరియన్ స్కిల్ యూనివర్సిటీ విజిట్ ను ప్రస్తావించిన మంత్రి గౌతమ్ రెడ్డి.రాష్ట్రంలో రానున్న స్కిల్ కాలేజీలలో సైతం 'సెంచూరియన్' స్థాయి ప్రమాణాలుండాలని దిశానిర్దేశం.స్కిల్ కాలేజీ ఆకృతులు, సైట్లకు సంబంధించిన వ్యవహారాలను పరిశీలించనున్న ప్రత్యేక ఆర్కిటెక్ లు.


    ఆర్థికపరమైన ఇబ్బందులు  రాకుండా సీఎస్ఆర్ నిధుల సమీకరణపై మరింత దృష్టి సారించాలి. త్వరలో  స్కిల్ కు సంబంధించిన కోర్సులు, కరికులమ్ పై హై నెట్ వర్క్ ఇండస్ట్రీస్ వర్చువల్ మీటింగ్. కొత్త కోర్సులు, ప్రాధాన్యత రంగాలపై టాప్ కంపెనీల నిపుణులు, విద్యావేత్తలతో చర్చించి ఆమోదం. ఇప్పటికే కీలక రంగాలలో భవిష్యత్ లో యువతకు ఉద్యోగావకాశాలుండే 20 కోర్సులపై అధ్యయనం. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాము, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పాల్గొన్నారు .