జంగాలపల్లి, ఇడిమేపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులతో కాకాణి జోరు


     నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జంగాలపల్లి, ఇడిమేపల్లి గ్రామాల్లో పర్యటించి, ₹3కోట్ల72 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి, కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.సర్వేపల్లి నియోజకవర్గంలో దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు నూతనముగా మంజూరైన ₹5,000/- రూపాయల పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.ఇడిమేపల్లి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాకాణి.


    గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధికి పైసా నిధులు ఇవ్వని పరిస్థితి.జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రామాల్లో అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాము.టిడిపి ప్రభుత్వంలో నీరు - చెట్టు కార్యక్రమం తెలుగుదేశం నాయకులు దోచుకోవడానికి ఉపయోగపడింది.వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి  కార్యక్రమాలు తప్ప, ప్రజా సొమ్మును దోచుకునే పథకాలకు చోటు లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత నాది.నియోజకవర్గంలోని ప్రజలకు అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నాము.


    దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్థులకు, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందచేయడం జరుగుతుంది.నియోజకవర్గంలో తాగు నీటి అవసరాల కోసం నిధులను మంజూరు చేయించి, శాశ్వత ప్రాతిపదికన త్రాగు నీరు అందిస్తాము.రైతులకు వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు మొదలగు అన్నీ  రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నాము.సర్వేపల్లి నియోజకవర్గంలో ఏడాది కాలంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలకు 800 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది.వై.యస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతుంది.రాష్ట్రంలో  పేదలకు ఆరోగ్య భద్రత కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.నన్ను ఆదరించి, నాపై నమ్మకంతో రెండవసారి ఎమ్మెల్యే గా గెలిపించిన మీకు ఇంటి బిడ్డలా ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను.


ఫై కార్యక్రమములో వేమారెడ్డి శ్యాంసుందర్ రెడ్డి,రఘురెడ్డి,కోదండరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.