మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైయస్. రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలోని రైతన్నలకు చేసిన సేవలు వెలకట్టలేనివని మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు అన్నారు. "వైయస్ఆర్ జయంతి" ని "వైయస్సార్ రైతు దినోత్సవం" గా జరుపుకుంటున్న శుభ సందర్భంగా డక్కిలి " వైయస్సార్ రైతు భరోసా కేంద్రం" వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
అంతకుముందు డక్కిలి లోని వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయనతోపాటు తిరుపతి పార్లమెంటు సభ్యులు శ్రీ. బల్లి దుర్గా ప్రసాద్ రావు గారు కూడా ఉన్నారు. వైయస్సార్ రైతు దినోత్సవ సభ లో శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజల హృదయాలను దోచుకున్న వైయస్సార్ ప్రజల హృదయాలలో నిలిచిపోయారని అన్నారు. వైయస్సార్ చిరస్మరణీయులని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మన వెంకటగిరి నియోజకవర్గం లోని 4 మండలాల్లోని నాలుగు లక్షల ఎకరాలకు కండలేరు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం వెలికల్లు రక్షిత మంచి నీటి పథకాన్ని శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో ఆనం రామనారాయణ రెడ్డి గారితో పాటు తిరుపతి పార్లమెంటు సభ్యులు శ్రీ దుర్గా ప్రసాద్ గారు వైఎస్ఆర్ సీపీ నాయకులు, చెలికం శంకర్ రెడ్డి, వెలికంటి రమణారెడ్డి, కలిమిలి రాంప్రసాద్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది లక్కమనేని కోటేశ్వరరావు, బొల్లంపల్లి కృష్ణ, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు డక్కిలి, వెలికల్లు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.