అన్నీ అనుకూలతలున్న విశాఖ రాజధానిగా పనికిరాదా, రాయపూర్, రాంచీలా ఉండిపోదామా, ముంబై, చెన్నై,బెంగళూరు,హైదరాబాద్ లా ఎదుగుదామా
కుల,మత, ప్రాంతీయతత్వాలులేని మన వైజాగ్ సహజసిద్ధ కాస్మోపాలిటన్ సిటీ. ఉద్యోగాల కల్పన నుంచి పెట్టుబడులను ఆకర్షించడం వరకు అనుకూలతల దృష్యా హైదరాబాద్, చెన్నై, బెంగళూరులాంటి, దక్షిణాది రాజధానులకు పోటీ ఇవ్వగల ఏకైక నగరమిది.విశాఖలో ఇప్పటికే అన్ని మౌలిక సదుపాయాలున్నాయి. రాజధానంటే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేవారికి ఉపాధి కల్పించి కడుపులో పెట్టుకున్న నగరం గా ఉండాలి. ఆ సత్తా విశాఖ నగరమునకు ఉంది, అటు భోగాపురం నుంచి అనకాపల్లివరకు మెట్రోకు సంబంధించిన వర్క్ నడుస్తోంది. విశాఖ పరిపాలనా రాజధానిగా వెలుగుతూ , యువతకు ఉపాధికల్పిస్తూ విశ్వనగరంగా విరాజిల్లుతుంది.
అమరావతిలో ఇవే మౌళిక సదుపాయాలు కల్పించాలంటే లక్షన్నర కోట్లు కావాలి.అసలు జీఎన్ రావు కమిటీకూడా రాజధానికి అనుకూలం విశాఖేనని. అక్కడ పెడితే అసలే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంపై అదనపు భారంకూడా ఉండదని తేల్చిచెప్పింది. టూరిజంలో చూసుకున్నావిశాఖజిల్లాలోని అరకు, లంబసింగి, నుంచి కైలాసగిరి వరకు సహజసిద్ధ ప్రకృతి అందాల సిగ. అందుకే తూర్పుతీరంలోనే అత్యధికంగా పర్యాటకులొచ్చే నగరం వైజాగ్. రక్షణపరంగానే ద బెస్ట్ విశాఖ, వెస్ట్రనే నేవల్ కమాండ్ ముంబైలో ఉంటే ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఉన్న సిటీ వైజాగే. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఎక్కువ కేంద్ర సంస్థలున్న నగరం విశాఖ. లైవ్ సబ్ మెరిన్ మ్యూజియమున్న ఏకైక నగరం.
రైల్వే జోన్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు , రోడ్ కనెక్టివిటీ ఉన్న నగరం. చెన్నై తమిళనాడుకు పూర్తిగా ఉత్తరంగా ఉంది - మహారాష్ట్రకు ముంబై, కేరళకు తిరునవంతపురం చివర్లోనే ఉన్నాయి.కర్ణాటకకు బెంగళూరు ఒక మూలనే ఉందన్న విషయం గుర్తించాలి. అంతెందుకు దేశరాజధాని ఢిల్లీ దేశానికి ఉత్తరంగానే ఉంది.నాగపూర్ , రాంచీలా ఉండిపోతామా. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబైలా ఎదుగుతామా అన్నది ప్రజలే తేల్చుకోవాలి. ఎడ్యుకేషన్ హబ్ - ఆంధ్రప్రదేశ్ లో తొలి యూనివర్సిటీ స్థాపించింది, బ్రిటిష్ వారే అతిపెద్ద ఆస్పత్రి కట్టింది విశాఖలోనే.చివరగా గ్రాపిక్ రాజధాని కావాలంటే అమరావతి, అభివ్రుది రాజధాని కావాలంటేవిశాఖ నగరము.