ఆదాయాన్ని పెంచిన ఏపీ సీఎం!!!


     రాష్ట్ర  ఆదాయాన్ని పెంచిన ఏపీ సీఎం జగన్ ని ఇరుకున పెడదామని, తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాల నరేంద్ర జగన్ కు ఒక లేఖ రాశారు.  అందులో 2018 -2019, ఆర్థిక సంవత్సరంలో తో పోలిస్తే 2019- 2020, ఆర్థిక సంవత్సరంలో  ఆదాయం పెరిగింది అంటూ అంగీకరిస్తూ 2018-2019 లో 1.50 లక్షల కోట్ల ఆదాయం వస్తే 2019- 2020 లో 1.87 లక్షల కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పాడు దీన్ని బట్టి చూస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన పది మసాలా తర్వాత జగన్మోహన్ రెడ్డి గట్టివాడు అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అంగీకరించినట్లయింది.


    అసలు సంగతి  ఏమిటంటే కరోనా వైరస్ నేపథ్యంలో జగన్ను ఇరుకున పెడదామని టిడిపి ప్రయత్నించి. లేఖ చంద్రబాబు రాయించి నట్లు అంటున్నారు. అసలు ఏపీ ప్రజలు గమనించాల్సిన విషయం, మొన్నటి వరకు జగన్ తుగ్లక్ పాలన వల్ల రాష్ట్రం అధోగతి పోయిందని. పరిశ్రమలు పోతున్నాయని, ఆదాయం గణనీయంగా పడిపోయినదని  గగ్గోలు పెట్టిన టిడిపి. పచ్చ మీడియా తో రాయించి బురద చల్లి ఇంత జరిగినప్పటికీ అసంకల్పితంగా నిజాలు బయటకు వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తో పోల్చుకుంటే జగన్ గారి పరిపాలనలో 30000 కోట్ల ఆదాయం పెరిగిందని అంగీకరించింది.


     రాష్ట్ర ఆదాయాన్ని పెంచిన పాలకుడు చేతగాని వాడు ఎలా అవుతాడు, ఏపీ ఆదాయాన్ని వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి, విదేశీ ప్రయాణాలకు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంచనా వేయాలని ఓపెన్ చేసి పెంచేసి, మద్దతుదారులకు దోచి పెట్టినవాడు, చేతకాని వాడు అవుతాడు. జీతాలను  2వాయిదాలు  లో చెల్లించాలని జగన్ నిర్ణయం పై ఉద్యోగులను రెచ్చగొట్టేందుకే టిడిపి ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించాలని చూసింది. అయితే తెలివిగల ఉద్యోగులు టిడిపి ఉచ్చులో పడకుండా జగన్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించారు. అంటే ఉద్యోగుల  ఇంకిత జ్ఞానం కూడా పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయనాయకులకు లేదా.