ప్రపంచాన్ని శాసిస్తున్న,కరోనా దెబ్బకు ప్రపంచమే తలకిందులైంది. అగ్ర రాజ్యాలు సైతం,కరోనా దెబ్బతగిలింది.మందులేని ఈ జబ్బుకు ప్రపంచ దేశాలు గడగడ లాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశ ప్రధాని మోడీ లాకౌట్ ప్రకటించడం జరిగింది. దీని దెబ్బకు మన తెలుగువారు పక్క రాష్ట్రాల్లో చిక్కుకుని, తినేదానికి భోజనం, ఉండేదానికి వసతి, లేకుండా ఇబ్బందులు పడుతున్నారు .ఈ సమయంలో మన తెలుగువారు కాశీలో చిక్కుకుని దిక్కుతోచని స్థితిలో ఉంటే వారికి నేనున్నాను అంటూ అభయమిచ్చి, తన కాశీ గాయత్రి స్వామివారి ఆశ్రమానికి తీసుకొనిపోయి అండగా నిలవడమే కాకుండా వసతి భోజన సదుపాయాలు అందించి మానవత్వాన్ని చాటుకున్న శ్రీ అబ్బూరి హరిహర శాస్త్రిగారు.
కాశీలో తెలుగువాడు, నెల్లూరు వాడు, అల్లిపురం వాసి, ఈ స్వామి కాశీలో గాయత్రి స్వామివారి ఆశ్రమాన్ని నడుపుతూ తెలుగువారికి సహాయం చేస్తుంటాడు. వారికి దర్శన భాగ్యం, ఉండటానికి వసతి, భోజన ఏర్పాట్లు చేస్తుంటారు. తన శేష జీవితాన్ని ప్రశాంతంగా మానవసేవే మాధవసేవ అనే సూక్తిని నిజం చేస్తూ అందరికీ సాయం చేస్తూ ఉంటారు. శ్రీ అబ్బూరి హరిహర శాస్త్రిగారు.కాశీ లో స్వామీ దర్శనం భాగ్యం కల్పిస్తూ ఎందరో తెలుగు వారికీ సహాయము చేస్తూ ఉంటారు.
చిక్కుకుపోయిన వారు మాట్లాడుతూ ఈ కాశీ గాయత్రి స్వామి వారి ఆశ్రమంలో శాస్త్రి గారు సహాయం మరువలేనిది, ఎటువంటి లోటు లేకుండా 23వ తేదీ నుంచి ఇప్పటివరకు ఉండేదానికి వసతి, తినేదానికి ఆహారము, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారని ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ హరిహర స్వామి కాపాడినట్లు భావిస్తున్నామని, ఈ ఆశ్రమం మాకే కాకుండా వంద మందికి రోజు పేదవారికి ఆహారం అందిస్తూ సహాయం చేస్తున్నారని.స్వామిని భగవంతుడు చల్లగా సూడాలని,నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో వర్ధిలాల్లని కోరుకుంటున్నానని అన్నారు.ఎవరికైనా సహాయం కొరకు ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించండి 89191 23647.