సేవే మార్గం వైపు అడుగులు!!!


    భారతదేశంలో కరోనా దెబ్బకు అల్లాడుతున్న జనాలు, పేదవాడు పట్టెడు అన్నం వైపు పరుగులు, భారతదేశ లాక్ డౌన్  కారణంగా, పేద ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారత దేశము లోని, ఆంధ్ర ప్రదేశ్ లోని,  నెల్లూరు జిల్లాలో, పేద ప్రజల అవస్థలు పడుతుంటే, మానవసేవయే మాధవ సేవ అని చెప్పిన పెద్దల మాటలను ఆదర్శముగా  తీసుకొని నెల్లూరు జిల్లాలో ఈరోజు రెండవ తేదీన, నెల్లూరు నగరం  మూడవ వార్డు లో కొండయ్య తోపు గిరిజన కాలనీలో 200 మంది నిరుపేదలకు సాంబార్ రైస్ పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేసిన గంగపట్నం అశోక్, భీమన శ్యాంబాబు, నీలి శెట్టి కోటేశ్వరరావు, సాయి, శ్రీనివాస్, ఎస్.రాధాకృష్ణ కుమార్, ఇందులో పాల్గొన్నారు.ఈ టైంలో వాళ్ళని ఆదుకుని మానవత్వాన్ని చాటుకున్న వీళ్ళని మా పత్రిక తరఫున మా పాఠకుల తరపునఅభినందిస్తున్నము.