బిగ్ బ్రేకింగ్ ఏమిటో చూద్దామా!!!


      ప్రపంచం నలుమూలల ఎవరి నోట విన్న,టీవీ లో చూసిన, ఏ వార్త పేపర్ చూసిన, సోషల్ మీడియా చూసిన, ఒకటే వార్త అదే కరోనా. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ  వ్యాప్తి చెందుతున్న వైరస్. దీనికి మందు కనుక్కో లేకపోతే ఇంకా ప్రపంచం మొత్తం ఈ వైరస్ వ్యాపించి భయాందోళనలు నెలకొంటాయి. ఇందుకోసం ప్రపంచం మొత్తం పీడిస్తున్న ఈ వైరస్ కు మందు కొనుక్కోవాలని  శాస్త్రజ్ఞులు ప్రయోగశాల లోనే  గడుపుతున్నారు.


     వారి ప్రయత్నాలు ఫలించి కరోనా వైరస్  నిర్వీర్యం అయింది, 48 గంటల్లో ఈ వైరస్ వీగి పోయిందని శాస్త్రజ్ఞులు తెలిపారు. యాంటీవైరల్ రీఛార్జ్ రీసెర్చ్ జర్నల్ తాజా సంచికలో ఈ విషయాన్ని తెలిపారు. ఆస్ట్రేలియాలో  ఈ పరిశోధన జరిగింది నివేదిక వెలువడింది. పరీక్షలలో వైరస్ ఎదగకుండా మానవ దేహం లో పరాన్నజీవులను హతమార్చేందుకు ఉద్దేశించిన 'ఐవర్‌మెక్టిన్'  అనే మందు కరోనా వైరస్ను చంపేసింది  ఒక్క డోసు తో 24 గంటల్లో ఈ వైరస్ తగ్గిపోయిందని, అదే 48 గంటలు అయితే ఈ వైరస్ పూర్తిగా  అంతం చేసిందని. సహ రచయిత ఆస్ట్రేలియా మోనా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన కైలీ వ్యాగ్‌స్టాఫ్ తెలిపారు.


    ఈ మందు హెచ్ఐవి,  డెంగ్యూ, ఇన్‌ప్లూయంజా, జికా వైరస్ వంటి వాటిపై బాగా పనిచేసిందని ఇప్పటికే రుజువైంది, అయితే ఈ పరీక్షలు జరిపింది పరీక్షనాళికలో మాత్రమే. దీన్ని మనుషులపై ప్రయోగించి, మరికొన్ని టెస్టులు చేసి, క్లినికల్ ట్రయల్స్, మరిన్ని సందేహాలు తీసుకున్న, తర్వాతనే కంట్రోల్ చేసే ముందు బయటకు వస్తుంది. అంతవరకు మనము వేచి చూడాల్సిందే.