సనాతన ధర్మానికి మన దేశం భారతదేశం, ఎందరెందరో మహానుభావులు, సనాతన ధర్మాన్ని, ఆచరించిన పుణ్య దేశం మనది. భారతదేశ సనాతన ధర్మాన్ని మంచి వక్తగా ప్రపంచ దేశాలకు తన వాగ్ధాటితో వివరించిన మన వివేకానంద స్వామి, మనకు ఆదర్శం. ప్రజలతో అనేక రోగాలు తగ్గడానికి కారణం ధ్యానం దాన్ని భారత దేశానికి అందించిన గౌతమ బుద్ధుడు, మనకు ఆదర్శం. సనాతన ధర్మాన్ని ఆచరించి చూపించిన మన ప్రియతమ నాయకులు గాంధీజీ నెహ్రూజీ మనకు ఆదర్శం.
అదేవిధంగా మన సనాతన ధర్మం వైపు అడుగులు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా ఇప్పుడు విస్తరిస్తున్నాయి. సంస్కారంతో చేసే నమస్కారం మన భారత దేశానిది, షేక్ హ్యాండ్ ఇచ్చే ధర్మం ప్రపంచ దేశాలది.ఒకానొక సమయంలో మన నమస్కారాన్నిఎగతాళి చేసిన ప్రపంచ దేశాలు, ఈనాడు కరోనా దెబ్బతో నమస్కారం విలువ తెలిసి నమస్కరిస్తున్నారు.ఈ ప్రపంచానికే మన నమస్కారం దిక్కు అయింది.
యోగాని ఇప్పుడు ప్రపంచమంతా ఇష్టపడుతున్నారు, ఈ మధ్య కొత్తగా అమెరికా అసెంబ్లీలో మన పండితులు మన సనాతన ధర్మం అయినటువంటి పూజలు కొనసాగుతున్నాయి. మొన్ననే యోగాపై ప్రధాన మోడీ పెట్టిన ట్వీట్ కు ఇవాంక ట్రంప్ స్పందించి చాలా బాగుంది అన్నారు. కాబట్టి మన పూర్వీకులు మనకు అందించిన సనాతన మార్గం వైపు అడుగులు వేద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.జై భారత్