మోడీ దెబ్బకు అబ్బా !!


       మోడీ భారతదేశ ప్రధాని, దమ్మున్న నాయకుడు, తన హయాంలో అనేక అద్భుత విజయాలను సొంతం చేసుకున్న అపర చాణిక్యుడు. తన పాలనలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న ప్రధాని. మానవ జీవితమే సవాళ్లు, ఆ సవాళ్లును ఎదుర్కొని విజయం వైపు దూసుకుపోతున్న నాయకుడు. మోడీ ముందర కుప్పిగంతులేసినా బలాదూరే. మోడీ  గ్రాఫ్ అనేది ఒక్కసారిగా ఆకాశమంత ఎదిగింది. భారతదేశ నాయకత్వంలోనే కాక ప్రపంచ నాయకుడిగా ఎదిగారు.


    అమెరికా, ప్రాన్స్, స్పెయిన్, ఇటలీ, చెందిన దేశాలలో కరోనా దెబ్బకు అబ్బ అంటుంటే. భారత్లో మాత్రం డబల్ డిజిట్ లోనే మరణాలు కంట్రోల్ చేసిన ఘనుడు మోడీ. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా మోడీ హవా వెలిగిపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మోడీని చూసి నేర్చుకోండి అంటూ యూరోపియన్ దేశాలకు సలహాలు ఇస్తుంది. ఇవన్నీ చూస్తున్న ప్రతిపక్షాలకు నోట మాట రావటం లేదు. ఎం ఆర్ సి ద్వారా ప్రతిపక్షాలు మోడీ కి వ్యతిరేకంగా కొంతైన   పోగు చేస్తామని అనుకుంటున్న వేళ, కరోనా వైరస్ భారతదేశంలోకి దూరింది.


    దీంతో మోడీ జనతా కర్ఫ్యూ అన్నారు. ఐదు గంటలకు క్లాప్స్ కొట్ట మన్నాడు,  ఊహించని విధంగా ఇది విజయవంతమైంది. రెండు రోజులాగి 21 రోజులకు  లాక్ డౌన్అన్నారు. దానికి జనం జై కొట్టారు. 5వ తేదీ దీపాలు వెలిగించాలని అన్నాడు. ఇది గూడా విజయవంతమైంది. 130 కోట్ల మంది మనసును తనవైపు తిప్పుకున్న నాయకుడు మోడీ. ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే జనాలకు మోడీ నాయకత్వం మీద విశ్వాసం ఏర్పడింది. ఈ దేశంలో ఆయన ఒక నమ్మకమైన నాయకుడిగా ఉన్నారు. కరోనా మీద ఆయన చేయాల్సింది చేస్తున్నారు. కానీ ఫలితాలు ఎట్లా ఉంటాయో చుడాల్చిఉంది . ఏది ఏమైనా కరోనా విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం  దేశానికి పట్టిన అదో గతి అవుతుంది. ఈ విధంగా గా ప్రతిపక్షాల కు  మోడీ దెబ్బ అబ్బా అనిపిస్తుంది .