ప్రపంచములో కరోనా పేరు చెబితే కంగారు పడిపోతున్న ప్రజలు, అగ్రరాజ్యం అమెరికా సైతం గజ గజ వణికి పోతుంది. దిక్కుతోచని స్థితిలోప్రపంచ దేశాలు, ఇటలీ, ఫ్రాన్స్, ఫిన్లాండ్, ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 52 వేల మంది చనిపోయారుఇటలీలో ఎక్కువ మరణాలు సంభవించాయి. తర్వాతి స్థానాల్లో, యునైటెడ్ స్టేట్స్, స్పెయిన్, ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మొహమ్మారీ పడినవారి సంఖ్య ఒక మిలియన్ దాటింది. దీని బారినుండి ప్రజలను రక్షించేందుకు పలు దేశాలు కఠినమైన చర్యలు చేపట్టాయి. కొన్ని దేశాలలో లాక్‌డౌన్ అమలు అవుతుండగా, 350 కోట్ల మంది ప్రజలు నిర్బంధంలో కొనసాగుతున్నారు.
విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి ముఖ్య కారణం ఈ కరోనాకు మందు లేకపోవడమే, ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలో మునిగి క్లినికల్ ట్రయల్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ప్రపంచం మొత్తానికి అదిరిపోయే మంచి వార్త తెలిపారు, అదేమిటంటే కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుందట, కరోనా వైరస్కు విరుగుడు కనుగొనే పక్రియ సత్ఫలితాలను ఇచ్చే దశకు చేరుకుందనిట్రంప్ వెల్లడించారు.
హైడ్రాక్సీక్లోరోక్వినైన్, అజిత్రోమైసిన్, కలయితో రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ కరోనాను నివారించే అవకాశం ఉందని, ఈ భయంకరమైన వైరస్ అంతానికి హైడ్రాక్సీక్లోరోక్వినైన్ సరైన మొగుడు అని ఇది ప్రభావవంతంగా వైరస్ పనిచేస్తుందని వైద్య నిపుణులు తెలిపారని చెప్పారు. ఇదేగాని నిజమైతే వైద్య చరిత్రలో అపూర్వం, అద్భుతం, ఆవిష్కృతం అవుతుంది. ఈ ప్రపంచానికి గొప్ప మలుపు అవుతుందని. ఇది ప్రపంచ దేశాల ప్రజలకు గొప్ప శుభవార్త, ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్.