ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ని నెల్లూరు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. 43, 47 వార్డులలో 144 సెక్షన్ విధించినట్లు చెబుతున్నారు. చేపలమార్కెటు, ములిముడిబస్టాండ్, జండావీధి, తదితర ప్రాంతాల్లో జనం బయటికి రాకుండా చూస్తున్నారు. కూరగాయలు కావాలన్నా సరుకులు కావాలన్నా ఇంటికే చేరుస్తున్నరు .కరుణా ఎఫెక్ట్ ఢిల్లీ మత ప్రార్థన కోసం ఢిల్లీ వెళ్లిన వారిలో నెల్లూరు జిల్లాకు లింకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఢిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనల కోసం 48 మంది, 68 మంది, వెళ్లినట్లు గుర్తించారు. ఈ అరవై ఎనిమిది మంది రిపోర్టులను పైకి పంపించారు వాళ్ళల్లో కొంత మందికి నిన్న నెగిటివ్ వచ్చినట్లు సమాచారం. ఇవాళ రేపు కొంత మందికి వచ్చే అవకాశం కనుక ఎవరైనా ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళలో ఇంకా ఉన్నా వారు ఎవరిని కలిసినా ఇలా అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఐసోలేషన్ వార్డు పోయి టెస్టులు చేసుకోవలసిందిగా ప్రభుత్వ అధికారులు కోరుచున్నారు.
వీళ్ళని గుర్తించడంలో నెల్లూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతంగా ఉంది. నెల్లూరు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండి క్యాడర్ను ముందుండి నడిపిస్తున్నాడు. ప్రజలను చాలా కేర్ఫుల్ గా ఉండమని దిశానిర్దేశం చేస్తూ ముందుకు పోతున్నారు. ఎవరికైనా నా సహాయ సహకారాలు కావాలి అన్నా దగ్గర్లో ఉన్నవాలంటీర్లు ని సంప్రదించవచ్చు. ( 43, 47 డివిజన్లని అధికారులు రెడ్ జోన్‌లుగా ప్రకటించారు,నిత్యవసరాలు, కూరగాయలు ఇళ్ల వద్దకే సరఫరా చేస్తున్నారు.)