ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు లో కరోనా దెబ్బ కారణంగా లాక్ డౌన్ దెబ్బకు పేద ప్రజలు అన్నపానీయాలు లేకుండా అల్లాడుతుంటే మేము కూడా మీసేవకు అంటూ కదంతొక్కిన నిత్య వాణి ఫౌండేషన్. జర్నలిజం లో ఉన్న నిత్య వాణి తెలుగు దినపత్రిక నడుపుతున్న నిత్య వాణి ఫౌండేషన్ కార్యదర్శి బొప్పూరు విజయ మోహన్ రావు పేద ప్రజలను ఆదుకోవాలని వారం రోజులుగా గా నెల్లూరు టౌన్ లో ఆహార పంపిణీ ప్రారంభించారు. అదేవిధంగా ముందస్తు అవగాహన భాగంగా హోమియో మందుల పంపిణీ నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కరోనా వ్యాధి పట్ల అవగాహన కల్పించి, అప్రమత్తంగా ఉండాలని కోరారు. హోమియో వైద్యులు రమాదేవి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, తో పాటు పరిసరాల పై దృష్టి సారించి, మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, ఆర్సనిక్ ఆల్బమ్ 30 హోమియో మందులను ఆరు మాత్రల చొప్పున రాత్రి ఆహారానికి ముందు వేసుకొని ఈ మహమ్మారి కి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ పి పెంచలయ్య సుబ్బమ్మ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు నిరాదరణకు గురైన వారికి ఆశ్రయం కల్పిస్తూ అన్న పానీయాలను అందిస్తూఈ సందర్భంగా నిత్య వాణి ఫౌండేషన్ కార్యదర్శి బొప్పూరు విజయ మోహన్ రావు మాట్లాడుతూ ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ కారణంగా తిండి లేని అనాధలకు ఆహార పొట్లాలను పంపిణీ చేయడం జరిగిందని మా సంస్థ దాతల సహకారంతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. నిత్య నిత్య వాణి ఫౌండేషన్ వారిని మా పాఠకుల తరఫున అభినందిస్తున్నాము.