అగ్ర రాజ్యాధినేత ట్రంపు, భారత రాజ్యాధినేత మోడీ, కి ఫోన్ చేసి మాట్లాడారు. మోడీ, మాట్లాడుతూ భారత్, అమెరికా కలసి corona పోరులో కలిసి పని చేద్దామని కోరానని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోడీ కి ఫోన్ చేసి, corona రోగుల చికిత్సలు లో వాడుతున్న మలేరియా నివారణ మందు' హైడ్రాక్సీక్లోరోక్విన్' తమ దేశానికి ఇవ్వవలసిందిగా కోరారు. ఈ విషయంపై మోడీతో మాట్లాడానని దీన్ని మన దేశానికి అందజేసే విషయంలో ఇండియా తీవ్రంగా పరిశీలిస్తుందని తెలిపారు. వైట్ హౌస్ లో corona వైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యులతో తను కూడా ' హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్ ను వాడుతాను అని నిర్మొహమాటంగా చెప్పారు.
ఈ మందు ఎగుమతిపై ఇండియా విధించిన ఆంక్షలను ఎత్తి వేయవలసిందిగా కోరానన్నారు. డాక్టర్ల సలహాపై ఈ మందులు తాను గూడా వాడతానని అని ట్రంపు మళ్లీ చెప్పారు. ఇండియాలో ఈ మందు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, కోట్లాది మంది ప్రజలకు ఈ మందు అవసరమవుతుందని అన్నారు. మనం ఆర్డర్ చేసిన ఈ మెడిసిన్ భారత్ త్వరగా విడుదల చేస్తే నేను ఎంతో ఆనందం చెందుతానని చెప్పారు. ఫోన్ లో మేమిద్దరం ఆనందంగా మాట్లాడు కున్నామని అమెరికాలోcorona మృతులకు మోడీ సంతాపం తెలిపారు.
అమెరికాలో corona ఆదివారం నాటికి మూడు లక్షల పంతొమ్మిది వందల రెండు కేసులు నమోదు,కాగా 8,175 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో 23,949 కేసులు నమోదయ్యాయి. తాజాగా వెయ్యి మందికి పైగా మృతి చెందారు. అగ్రరాజ్యం కరోనా కారణంగా మలేరియా నివారణ మందు కోసం ఇండియా వంటి దేశాన్నికోరటం విశేషం. ఏదైనా అమెరికాలోcorona త్వరగా తగ్గి జనాలు సంతోషంగా ఉండాలని కోరుకుందాం.