ఢిల్లీలోమతపరమైన ప్రార్థనలకు హాజరైన వారే ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారు. వీరివల్ల ఒక్కసారిగా కరోనా రాష్ట్రంలో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు..దీంతో బాధితుల సంఖ్య 111కు చేరింది. ఈరోజు రాష్ట్రంలో మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 115కు చేరింది. ఈరోజు ప్రకాశం జిల్లా చీరాలలో రెండు కేసులు, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తిలో, రెండు కేసులు నమోదయ్యాయి.ఏపీలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
కొత్త కేసులు నమోదవుతూ ఉండటం ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తుంది.నిన్నటితో పోలిస్తే ఈరోజు తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనప్పటికీ రాత్రికి కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాలలో మాత్రం కరోనా ప్రభావం తక్కువగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
కర్నూలులో ఇప్పటివరకూ కేవలం ఒక కేసు మాత్రమే నమోదైంది. పశ్చిమ గోదావరి, కడప, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. లాక్ డౌన్ విషయంలో మరిన్ని కఠిన నిర్ణయాలను అమలు చేస్తోంది. ఈరోజు నుంచి అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారని సమాచారం అందుతోంది.
.