లాక్‌డౌన్ ఫై ప్రధానిసీఎంలకుసూచనలు!!!


     ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను మీరెంతో లాక్‌డౌన్నుపకడ్బందీగా అమలు చేస్తున్నారు, మీ అడ్మిస్టేషన్ బాగుంది అంటూ ప్రధానమంత్రి  ప్రధానిమోదీ కొనియాడారు.ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్‌డౌన్ తీరును తెలుసుకున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతోందని అన్నారు. ఢిల్లీ నిజాముద్దీన్‌లో జమాత్ ప్రతినిధుల వ్యవహారం బయటికొచ్చాక దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయని అన్నారు.


    కరోనాను నియంత్రించాలంటే వచ్చే కొన్ని వారాలు మరింత అప్రమత్తంగా ఉండాలి. లాక్‌డౌన్ ముగిశాక ప్రజలంతా ఒక్కసారిగా బయటకు వచ్చే అవకాశముంది. కానీ అలా జరిగితే మళ్లీ కరోనా వ్యాప్తి చెందే ప్రమాదమూ ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంయుక్తంగా ఒక పరిష్కారం వ్యూహాన్ని రూపొందించాలి. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. అంటూ సీఎంలతో మోదీ వ్యాఖ్యనించారు. లాక్‌డౌన్ పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తామని తెలిపారు.


    . ఇక ఏపీ, తెలంగాణలో కరోనా నివారణకు చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్ అమలు తీరును ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్, సీఎం జగన్ విడివిడిగా వివరించారు. కేంద్రం తప్పకు ఆర్థిక సాయం చేస్తుందని ప్రధాని జగన్మోహన్‌రెడ్డికి హామీ ఇచ్చారు. వైద్య సదుపాయాలకు సంబంధించి ఎలాంటి సహాయం చేయడానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే మెడికల్ పరికరాలు తగిన సంఖ్యలో సమకూర్చాలని జగన్‌కు సూచించారు. మొత్తంగా పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని.. ఐతే ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారి వల్లే కేసుల సంఖ్య పెరిగిందని ప్రధానికి ఇద్దరు సీఎంలు వివరించారు. మనదేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 1965 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.